Wednesday, May 26, 2010

మా శ్రీకాళహస్తి "రాజగోపురం" చిత్రాల్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నా..!

చిత్తూరు జిల్లాలో,శ్రీకాళహస్తి అందం,ప్రతిష్ట "రాజగోపురం",అందరి దగ్గర "గాలిగోపురం" గా పిలవబడే ఈ కట్టదం, ఒక్కసారిగా నిన్న(26.05.2010 తేదిన) నేలమట్టం అయ్యింది. ఇది నా మనసును ఎంతగానో కలిచివేసింది ...క్రీ.శ.1516 లో విజయనగర సామ్రాజ్య రాజు శ్రీ కృష్ణ దేవరాయలు గజపతుల పై విజయానికి చిహ్నం గా ఈ అందైన కట్టడాన్ని నిర్మించారు. ఇది 133 అడుగుల ఎత్తు నిర్మాణం.

ఈ సందర్బంలో చివరిగా నేను అందమైన మా ఊరి గాలిగోపుర చిత్రాల్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నా..!







ప్రేమకి, పెళ్ళికి గల వ్యత్యాసం ఏంటి ..??


క్లాసులో అంతా శ్రద్దగా తెలుగు టీచర్ చెబుతున్న పాఠాన్ని వింటున్నారు.


ఇంతలో ఆ క్లాసులో కాస్త చురుకుగా వుండే పిల్లవాడు ఒకడు లేచి, "టీచర్ నాకో డౌట్..!",అన్నాడు.


పిల్లలకి వున్న సందేహాలని తీర్చడం టీచర్ గా ఆమె భాద్యత ,"అడుగు బాబు.." అంది ఆ టీచర్.


"ప్రేమకి, పెళ్ళికి గల వ్యత్యాసం ఎంటి?", అని అడిగాడు..,


టీచర్ నవ్వుకుంటూ ఆ బాబు ని దగ్గరకి పిలిచి,


"బాబు అక్కడ కనిపిస్తున్న బియ్యపు గోదాములోకి వెళ్ళి, అక్కడ ఎండకి ఆరపెట్టిన బియ్యంలో అతి పెద్దదైన బియ్యపు గింజని తీసుకొనిరా, కాని ఒక్క షరతు, తీసుకున్న గింజ మళ్ళి ముట్టుకోకూడదు...!", అని చెప్పింది.


చెప్పిందే తడవుగా ఆ పిల్లవాడు అక్కడికి వెళ్ళి అతి పెద్ద గింజ కొసం వెతకదం ప్రారంబించాడు. అత్యుత్సాహంతో అన్ని పెద్ద గింజలని వదిలేసి అందులో చివరికి చిన్న గింజని తీసుకొచ్చి టీచర్ కి ఇచ్చాడు, ఏదో పొగొట్టుకున్న వాడిలా.


టీచర్ మళ్ళీ తనతో, "ఇంకో అవకాశం ఇస్తున్నాను,ఈ సారి వెళ్ళి తీసుకొని రా ..!" అంది.


ఈ సారి ఆ పిల్లవాడు తెలివిగా,తనకి కనిపించిన కొద్దిపాటి గింజల్లో ఒక పెద్ద గింజని తీసుకొచ్చి తీచర్ కి ఇచ్చాడు,కాని ఇప్పుడు ముందు కంటే మేలుగా కాస్త పెద్ద గింజే తీసుకొచ్చాడు ,కాస్త నవ్వుతూ.


"ప్రేమకి,పెళ్ళికి గల తేడా కూడా నువ్వు చేసిన ఈ పనిలోనే వుంది,ఆ తేడాని నువ్వు నాకు రేపు క్లాసులో అందరి ముందు వినిపించు",
అని చెప్పి..క్లాసు ముగించింది టీచర్.


తర్వాత రోజు ఆ పిల్లవాడు ఏమి సమాధానం ఇస్తే ఆ టీచర్ సంతోషిస్తుందో... మీరే చెప్పండి ...?

వచ్చే సంవత్సరం అంతరిక్షంలోకి చంద్రయాణ్ ..!



అమెరికా వైట్ హౌస్ లో,
భారత ప్రధాని మన్మోహన్ సింగ్.. తనలో తను మనసులో సంతోషంతో నవ్వుకోవడం చూసి.. అమెరికా అధ్యక్షుడు ఒబామ(బ్రేక్ టైంలో..)
...
ఒబామ: ఏంటి సింగ్ గారు.. భారత్ విశేషాలు ..?
మన్మోహన్ సింగ్: మేము వచ్చే సంవత్సరం అంతరిక్షంలో చంద్రయాణ్ పేరుతో చంద్రుని పైకి మనుషుల్ని పంపే ప్రయత్నంలో వున్నామండి ..!..! (ఎంతో సంతోషంతో..గర్వంగా ).


ఒబామ: అవునా చాల సంతోషం.. మరి ఏ దేశస్తుల్ని పంపుతున్నారు..?
మన్మోహన్ సింగ్: వేరే దేశస్తుల్ని దేనికి..అందరూ మా దేశస్తులే..!


ఒబామ: ఎంత మంది..?
మన్మోహన్ సింగ్: ఓ వందమంది అనుకున్నాము ఇప్పటికి..!


ఒబామ: ఆ...!,అంతమందితో ప్రయాణం కష్టం కదా..!
మన్మోహన్ సింగ్: అవును ఒబామ గారు..,మా వాళ్ళు NASAకి దీటుగా రాకెట్ ని తయారు చేస్తున్నారు,
ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారి జరుగుతుంది ..ముందున్న రికార్ద్స్ ని మా దేశం తుడిచిపెడుతుంది...!


ఒబామ: అలాగ..!, ఇంతకీ ఆ వందమంది ఎవరో తెలుసుకోవచ్చా..!
మన్మోహన్ సింగ్: ఓ యస్ ... ..!


OBC - 25
SC - 25
ST - 25
PHC - 5
SportQuota - 5
NCC & etc - 10
Recommandations - 4


వీలైతే చివరిగా ఒక వ్యోమగామి ...ఒబామా గారు..!,
తనే వీళ్ళందిరికి న్యాయకత్వ భాద్యతలు తీసుకుంటాడు ..!

Monday, May 24, 2010

పాశ్చాత్య సినిమాలు...వాటి తీరు ...!



"అది ఒక పాడుబడిన కోట, ఆ కోటకి కాపలా కాసే వాచ్ మెన్ అంత సేపు మేలుకొని మెల్లగా కునుకు తీశాడు...వున్నట్టుండి కోటలోపలి నుండి గట్టిగా శభ్దం ఎవరో అమ్మాయి గొంతు ...గట్టిగా అరిచినట్టు..ఇంతలో నిద్రలో వున్న అతను లేచి పక్కనే వున్న కోట తాళాల గుత్తి.లాంతరుతో కోట వైపు కోట తలుపులు తీసే ప్రయత్నం చేసాడు.

లోపల అంతా చీకటి ఎదురుగా కనిపిస్తున్న మెట్లను లాంతరు వెలుగులో ఎక్కే ప్రయత్నం చేసాడు...పక్కనే అటు ఇటు మెల్లిగా తిరుగుతున్న ఓ తలుపు వైపు తన పాదాలను మోపాడు ..!,మెల్లగా ఆ గదిలోకి ప్రవేశించాడు...,ఆ గది కోటలో ఒకప్ప్పుడు నివసించిన రాణి వారి అలంకార గది...,అదే గదిలో ఎదురుగా వున్న ఒక పెద్ద అద్దం వైపు చూస్తూ దాని దగ్గరకి వెళ్ళాడు.

ఇంతలో ఆ నిశబ్ద వాతావరణంలో ఆ అద్దం అంతా ఒక్క సారిగా చీలుతూ పగలడం మొదలయ్యింది..అంత వరకు ఎంతో దైర్యం గా వున్న ఆ వాచ్ మాన్ భయపద్దం మొదలు పెట్టాదు.. అంతే తన ముఖాన్ని అలానే పగిలిన అద్దంలోకి చూస్తుండగానే ...కింద పడిన ఒక పెద్ద అద్దం ముక్కతో అద్దంలో అటు వైపు వున్న తన ప్రతిబింబం తన గొంతును తనే కొసుకునే ప్రయత్నం చేస్తుంది ... ఇటు వైపు వాచ్ మాన్ కి గొంతు తెగి,రక్తం మడుగులో పడి విల విల లాడుతూ ప్రాణాలు వదిలాడు..!.
"



ఇంక చాలు వ్రాసే నాకే టైప్ చేయడానికి వ్రేళ్ళు వణుకుతున్నాయి...ఇదంత నిన్న ఆదివారం మా స్నేహితుల రూంలో చూసిన "మిర్రర్" అనే ఒక ఆంగ్ల చిత్రంలోని ఒక సన్నివేశం,... కొంపదీసి ఈ సన్నివేశం నేను గాని సృష్టించానని అనుకున్నరా ఎంటి..మనకు అంత సీన్ లేదు.


ఇప్పుడు ఈ సోదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నానంతే కారణం వుంది...,


ఒక గదిలో మద్యాహ్నం 3గంటల ప్రాంతంలో, గది తలుపులు గడిపెట్టి, కాస్త రూం అంతా చీకటి గా వున్న వాతావరణంలో మా స్నేహితులతో కలసి ఆ సినిమాని చూస్తున్న నాకే భయం ఆగడం లేదు..అలాంటిది చిన్న పిల్లలు ఇలాంటి సినిమాలని ఎలా చూస్తారా..? అని ఆలోచించా ..!.


పాశ్చాత్య దేశాలలో ఇలాంటి సినిమాలు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆస్వాదిస్తారట,అదేం సంస్కృతో అదేం మనుషులో...!.
మనషులు ఆలొచనా విధానం,వారి నడవడిక..వారిని పెంచిన తల్లిదండ్రుల మీద ఆదారపడి వుంటుంది..,


ఇలాంటి సిమిమాలను చూశాక పిల్లల్లో వుండే మరో కోణాన్నివాళ్ళకి తెలియకుండానే ఇవి వెలుగులోకి తీసుకొస్తాయి ..,తద్వార చిన్న వయసులోనే జైళ్ళు పాలయిన సంధర్బాలు ఆ దేశాళ్ళో కోకొల్లలు ,కాబట్టి వారికి ఏ వయసులో చేయాల్సిన అలవాట్లు ఆ వయసులో సమకూరేటట్లు తల్లిదండ్రులే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.


ఆ సినిమా చూసాక సరిగ్గా అద్దం ముందు ఒంటరిగా నిలబడాలన్న నాకు భయం వేస్తుంది ...,అసలే మా రూంలో ఈ రోజు నేను ఒక్కడినే వుంటున్నా.. ,మా రూంలో ఒక పెద్ద అద్దం కూడ వుంది, ఈ రోజు రాత్రి ఎలా వుండాలో ఏమో ...!,ప్లీజ్.. ప్లీజ్..ఎవరన్నా నాకు తోడుగా వుండరూ..! :-)

Thursday, May 20, 2010

ఒక్కరోజు గ్రామంలో....!


ప్రతి వారాంతం హైదరాబాదులో విసుగ్గా వుంటుందని ఈ సారి మా అక్క వాల్ల ఊరికి వెళ్దామని నిర్ణయించుకున్నాను ..,


శనివారం ఉదయమే అక్క వాళ్ళ ఊరు... కడపలో బస్సు దిగాను ,
మా బావ బైక్ లో వచ్చి గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నాడు.


తను డాక్టర్ గా పని చేస్తున్నాడు కడప, RIMS హాస్పిటల్ లో...,
మా అక్క కూడ డాక్టర్ కాబట్టి ఇద్దరికి జోడు బాగుంటుందని మా అక్కకి ఈ సంబందం చేసాడు..మా నాన్న.


మా బావ వాళ్ళ ఇంటిలో అందరూ ఉమ్మడిగా కుటుంబంలా ఒకే ఇంట్లో వుంటారు,
అందరిని పలకరించి నేను రెడీ అయ్యేసరికి సమయం పది అయ్యింది.


ఈ రోజు అక్కతొ కలసి నేను కూడ వాళ్ళ హాస్పిటల్ కి వెళ్దామని అనుకున్నాను,
చెప్పడం మరిచాను మా అక్క కూడ కడపకి 6oKM దూరం లో వున్న బి.కోడూరు అనే మారు మూల గ్రామంలో ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తుంది..,రోజూ ఉదయంతో వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చేది.


ఆ రోజు కాస్త ఆలస్యంగా నేను,మా అక్క వాళ్ళ కారులో ఆ గ్రామానికి బయలుదేరాము..,
వెళ్ళిన కొంత సేపు చుట్టు పక్కలా అంతా పచ్చని పైరు,పొలాలు ఆ వాతావరణం చూడడానికి సంతోషంగా అనిపించింది....


ఇంకాస్తా ముందుకి వెళ్ళగానే కొండల మొదలు అంతా బీడు భూమి కనిపించదం మొదలయ్యింది,
ఇలాంటి ప్రదేశాల్లో కూడ ప్రజలు వుంటారా అని సందేహం నాలో కలిగింది..,అంతా ఎర్రమట్టి నేల..!,
కడప జిల్లా రంగు రాళ్ళకి బాగ ప్రసిధ్ధి,అలాగని ఆ ప్రాంతంలో నివసించడానికి కాదు కదా..!.


దారిలొ ఓ చోట మా అక్క డ్రైవర్ ని కారు ఆపమంటే సడెన్ గా ఆపాడు,
అలా కిందకు దిగాము, చుట్టూ అంతా ప్రొద్దుతిరుగుడు పూల పంటతో కనుచూపుమేర వరకు ఏదో పసుపూ తివాచి పరిచినట్లు చాలా అందంగా వుంది..,ఇంతలొనే ఇంత భేధమా అని అనుకున్నాను ..!,నా దగ్గర వున్న మొబైల్ ఫొన్తో కాసేపు ఫొటోస్ తీసుకొన్నాము.


మళ్ళి మొదలయ్యి తిన్నగా మా అక్క వాళ్ళ హాస్పిటల్ కి చేరాము,ఆ పల్లెలో అంతా వ్యవసాయం చేసే వాళ్ళే ఎక్కువ,
ప్రభుత్వాసుపత్రి, ప్రభుత్వ పాఠశాల సౌకర్యాలు బాగనే వున్నాయి..కాని వ్యవసాయం నమ్మినవాడు వ్యవసాయం, విద్యని నమ్మినవాడు విద్యలో కొనసాగుతున్నారు.సరిగ్గా లెక్క పెడితే మొత్తం 100 మంది వుంటారేమో ఆ పల్లెలో..!.


ఇంతలో నన్ను ఎవరా అని చూస్తున్న అందరికి "మా తమ్ముడు..!", అన్న మా అక్క సమాదానం అక్కడున్న వాళ్ళ మొహాళ్ళొ కాస్త ఆనందం నింపింది.


"ఏమి చేస్తావు బాబు..?" అని ఎవరో అడిగితే, "నేను హైదరబాదులో ఉద్యోగం చేస్తున్నాను..!" అని చెప్పా,
అలా కాసేపు వరండా బయట నుండి చుట్టుపక్కల ప్రదేశాలు గమనించాను..!,


ఇక్కడ సిటీలో లాగ, మనుషుల ఉరకలు పరుగులు లేవు,
మనిషికి మనిషికి సంబందం లేనట్టూ అక్కడలా ఇక్కద కనిపించలేదు..,
వీళ్ళ ఆలోచనావిధానానికి సిటీలో వారికి వ్యత్యాసం చాలానే వుంది,


అలా ఇలా మధ్యాహ్నం భోజన సమయం అయ్యింది.


రోజూ ఇంటిదగ్గరనుండి భోజనం తీసుకొచ్చే మా అక్క ఆ రోజు ఆ వూర్లోనే అదే హాస్పిటలో మందులు ఇచ్చే ఒక ఉద్యోగి ,పేరు నాకు గుర్తులేదు,కాని అతను చాల మంచి వాడు,పెళ్ళి అయ్యి రెండు సంవత్సరాలు అయ్యింది..,నన్ను, మా అక్కని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్ళాము...!,చాల బాగా రిసీవ్ చేసుకున్నారు..,అతనికి 9 నెలల బాబు,ఆ బాబు వచ్చీ రాని మాటలొతో చాలా ముద్దుగ వున్నాడు.


చెప్పడం మరిచిపోయాను రాగిసంఘటి ఇక్కడ చాలా బాగుంటుంది...,భోజనం అయ్యాక కాసేపు మంచి ఎండకి ఓ చెట్టు నీడన అలా కూర్చుని తాటిముంజలు తిన్నాము ఆ రోజుని నేను ఇప్పటికీ మరిచిపోలేను.మళ్ళీ హాస్పిటల్ కి వచ్చి కాసేపు వుండి..., కడపకి అంటే అక్కా వాళ్ళా ఇంటికి తిరుగుముకం పట్టాము కారులో..!.


అలా ఆ రోజంతా కడపకి దగ్గరి గ్రామంలో గడిపాను...!.


కాని ఇక్కడ ఒక్క విషయం చెప్పాలని అనుకొంటున్నాను,


మనం సినిమాల్లో చూసినట్టు కడప అంటే ఏదొ కత్తులు,కొడవళ్ళు చేతుల్లో పెట్టుకొని తిరుగుతున్నట్టు ఇక్కడ ఎవ్వరూ వుండరూ..,
ఇక్కడ అన్ని రకాల భూములు వున్నాయి అన్ని రకాల మనుషులు,అన్ని రకాల జీవన శైలులు కనిపిస్తాయి.


మనలో మన మాట.... " రెక్కాడితే కాని డొక్కాడని ఒక మనిషి కత్తులు,కటార్లతో ఏమి సాదిస్తాడు.. ..",మీరే ఊహించండి ..!


మన రాష్త్రంలో ఎక్కడికెళ్ళినా కష్టపడందే నాలుగు రాళ్ళు సంపాదించలేము, కడుపు నింపుకోలేము ..,అది నేనైనా కావచ్చు, మీరైన కావచ్చు ఇంకెవరైనా సరే, ఇది అందరికి తెలిసిని నగ్న సత్యం....ఒక మనిషి ప్రాంతం పేరు చెప్పి ఎన్ని రోజులు బ్రతక్కలడు ...!


నేటి యువతలో ప్రాంతాభిమానాన్ని రెచ్హగొడుతూ వారిని తమ స్వార్ద ప్రయోజనాలకి ఎలావాడాలో అలా వాడుకుంటూ వారి భవిష్యత్తున్ని నాశనం చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు..!




ఎక్కడొ ఒక వ్యక్తి ఊరు విడిచిపెట్టి పోయి, చాలా రోజుల తర్వాత, బాగా చదువుకొని తిరిగొచ్చి వాళ్ళ అమ్మ నాన్నలకి ఉద్యోగంతో తిరిగొస్తే, ఆ తల్లిదంద్రులకి ఎంత ఆనందంగా వుంటుంది.


అదే ఒక వ్యక్తి ఊరు విడిచిపెట్టి పోయి పట్టణంలో, రాష్త్రంలో ఒక ప్రాంతం కోసం ఇన్ని రోజులు మనల్ని స్కాలర్షిప్ లతో పొషించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలిలొ గొడవ కారణం చేత మరణించాడు అంటే, అదే తల్లిదంద్రులకి ఎంత బాధగా వుంటుంది.


కాబట్టి ......!


విద్యార్దులూ తస్మాత్ జాగ్రత్త...!మనం ఇంకా అనాగరికపు కాలంలో జీవించడం లేదు....మనకు కావలసిన సదుపాయాలు అన్ని వున్న ఈ దేశంలో కాస్త వివేకంగా సమయస్పూర్తితో వుండమన్నదే నా సందేశం..!

Wednesday, May 19, 2010

ఎ.సి ప్రయాణం బహు ప్రీతి సుమీ....!




వేసవి లో ప్రయాణం అంటే ఎంత విసుగో అందరికి తెలిసిందే..!,


మా స్నేహితుడు ఈ సారికి ఎ.సి లో వెళ్దాం, మా అక్క కొడుకు అడుగుతున్నాడు అని నన్ను బలవంతం చేస్తే..సరేలే అన్నాను ..!,


నేను, మా స్నేహితుడు,వాళ్ళ తాలుకు ఇద్దరు...!,
ఎప్పుడూ లాగే ఈ సారి కూడ తత్కాల్ కోటలో రిజర్వేషన్ చేయించాము..!,


ప్రయాణం మొదలు అయ్యింది అంతా బానే వుంది,
ఇంతలో మొదలయ్యాయి కష్టాలు, మరీ ఎక్కువ చల్లదనం మమ్మల్ని కాస్త ఇబ్బందికి గురిచేసింది...!,


ఇంతలో మేము ఆర్డర్ ఇచ్చిన భోజనం వచ్చేసింది, అప్పటిదాక పడుకొని వున్న మా స్నేహితుని అక్క వాల్ల అబ్బాయిని భోజనం చెయ్యమనడానికి పిలిచాడు ..!,
తను "వద్దు" అని, మొండిగ సమాధానం ఇచ్చాడు,
విచారిస్తే తనకి A.C వల్ల ఏదో తల తిరుగుతున్నట్టు వుందని చెప్పాడు ..!,


ఏమి చేయ్యాలో అర్దం కాక తనని కాసేపు A.C రూం నుండి బయటికి తీసుకొని వచ్చి కాసేపు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసాము ,
చిన్న పిల్లావాడు కాబట్టి తనతో పాటుగా మేమూ కూద కాసేపు బయటే వరండాలో వుండవలసి వచ్చింది...,
అంతలో కొంతలో కొంత ప్రయోజనం అనిపించింది...!,


ఆ విదంగా ఆ రాత్రంతా తనని ఓదార్చి కాస్త ఆలస్యంగా నిద్రపోయాము..!,


తెల్లవారి స్ఠేషన్ రాగనే,ఎక్కదో చిన్నగా మాలోంచి ఒక గొంతు నీరసంతో,


"ఇంక బుద్దుంటే ఎ.సి లో రాను...", అంటూ ...!,
(ఎవరొ కాదు ఆ పిల్లవాడే....)


మా వాల్లందరికి నవ్వు ఆగలేదు...!,


ఆ పిల్ల వానికే కాకుండ అందరికి ఆ సంఘటన మరిచి పోలేని సంఘటనగా మిగిలింది..!

లైల ఓ లైలా...!


రోజూ ఆఫీసుకి రావదమే నా కంప్యుటర్లో "GMail" చెక్ చేసుకోవదం అలవాటు,ఈవాళ కూడ యదా ప్రకారం అకౌంట్ లోకి లాగిన్ అయ్యి ఈ-మెయిల్స్ చెక్ చెసుకుంటున్నాను,
"GMail" అకౌంట్ లొ ఈ మధ్య కొత్తగా "BUZZ" అని ఒక అంశం చేర్చారు, ఎవరో కామెంట్ పంపారు అని చూస్తే అందులొ ఇలా రాసి వుంది...,


నేను ఇంగ్లిష్ లో రాసి తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను,
"Watt a pleasant weather now in hyderabad after a sooo long gap, itz really the Laila effect. Thanks to Lailaaaaaaa..........."


అంటే, ఈ రోజు హైదరాబాదులో చాలా రోజుల తర్వాత, ఎంతటి ప్రశాంతమైన వాతావరణంతొ వుందో, ఇది నిజంగా లైలా ప్రబావమే ..ధన్యవాదాలు లైలా ..అని రాసుంది..!,


నాకు అర్దం కాక ఒక్క పట్టాన ఈ లైలా ఎవరబ్బా అని ఆలోచించదం మొదలుపెట్టాను,రాసిన అతన్ని అడుగుదామంటే చిన్నతనంగా వుంటుందేమో అని సందేహం,చివరికి కొంత ధైర్యం చేసి అఢిగేశాను చిన్నగా,


అతను నవ్వు ఆపుకోలేక లైలా అంటే అమ్మాయి అనుకున్నవా కాదు కాదు,
అది ఒక తుఫాను పేరు అని చెప్పగానే నేను కూడ అతనితో నవ్వదం మొదలు పెట్టాను ..!


ఓ పట్టాన హాస్యం, ఓ పట్టాన జ్ఞానం అంటే ఇదేనేమో...మరి ...!! :-)