Wednesday, July 21, 2010

రామెన్ సూప్ - జపనీస్ వంటకం..!


ఈ మధ్య ఆఫీస్ వేళలు మార్చేసరికి సాయంత్రం కాస్త త్వరగా మా రూం కి రావలసి వస్తోంది..
సరే అని రూంలో కాసేపు టి వి ఆన్ చేసి రిమోట్ తో చానెల్స్ మారుస్తున్నాను ఇంతలో స్టార్ మూవీస్ చానెల్ లో ఏదో సినిమా వస్తోంది ....చూడడం మొదలెట్టాను ....!

సినిమా అంతా జపాన్ దేశంలో చిత్రించారు ...ఇందులో కథా నాయిక అమెరికా నుండి జపాన్ కి తను ప్రేమించిన వ్యక్తితో  వచ్చేస్తుంది.. అక్కడ మళ్ళీ ఇంకో దేశానికి వెళ్ళే సందర్బంతో ప్రేమించిన వ్యక్తి తనని మోసం చేసి ఆమెని జపాన్ లోనే వదిలి వెళ్ళి పోతాడు...మోసపోయానని తెలుసుకున్న ఆమె తను వుంటున్న ఇంటికి ముందు ఒక జపనీస్ రెస్టారంట్ కి వెళ్ళి తినడానికి ప్రయత్నిస్తే ఆ హోటల్ యజమాని తనని వారించి అక్కడి నుండి పంపే ప్రయత్నం చేస్తాడు.

ఇంతలో ఇదే అదునుగా "నేను మీ షాప్ లో పని చేస్తాను మీ వంటలు వండి ఇక్కడే పని చేస్తాను ",అని అంటూ ....ఆ యజమాని కి  కాక పట్టడ్దం చేస్తుంది..తను ఆమెను వారికంచలేక సరే మరుసటి దినం నుండి  రమ్మని చెబుతాడు. చెప్పిందే తడవుగా మరుసటి దినం  తను ఆ హోటల్ తెరవక మునుపే వచ్చి కూర్చుంటుంది.., అలా అక్కడి  యజమాని కి చేదోడు వాదోడు గా వుంటూ ఆ దేశపు ప్రసిద్ది వంటకం "రామెన్ సూప్"ని  ఎలా చేయాలో అడుగుతుంది ...ముందు ససేమిర అని చివరికి ఎలాగో అలా నేర్పిస్తాడు.

కాని ఆ వంటకం వండడం అంత తేలికైన పని మాత్రం కాదు..., అది చేసేటప్పుడు చాల జాగ్రత్తగా మనసు దగ్గర పెట్టి చేయాలి, అప్పుడే దాని రుచి భేషుగ్గా వస్తుంది, ఇవన్నీ నాకెలా తెలుసు అని అనుకుంటున్నారా..ఆ సినెమా లో ఆ యజమాని ఆమెకి చెబుతుంటాడు లెండి,  హ హహ్హ ....! ,
అంత గొప్ప వంటకమా అని తర్వాత నేను "GOOGLE" లో వెదకటం ప్రారంబించాను,
"రామెన్" అంటే అది ఒక సూప్ లాంటి వంటకం చేప లేద మటన్ ని వుడక పెట్టిన నీళ్ళలో నూడుల్స్ వేసి రుచిగా చేసే వంటకం, ఇది ఆరగిస్తే ఒక బోజనం కి సమానం అని చెప్పారు.

ఇంతకీ నేను సినిమా సంగతి మర్చిపోయాను...!

చివరికి, సొంత కొడుకుని ఆ హోటల్ కి వారసుడిని చేద్దామని అనుకున్న తనకి ఆమెరికా అమ్మాయికి ఇలా వచ్చిన వంటకాన్ని బోదిస్తానని అనుకోలేదు అని బాద పడుతుంటాడు. ఆ వూరిలో బాగ రామెన్ చేయగల వ్యక్తుల సరసన చేరుతుంది ఈ ఆమెరికా అమ్మాయి. సొంత దేశం అయిన ఆమెరికా కి వెళ్ళి అక్కడ "The Ramen Girl" అని ఒక రెస్టారెంట్ ని ఒపెన్ చేసి సినిమాకి తెర దించుతుంది..!.

ఇక్కడ చెప్పడం ఒకటి మరిచాను..ఈ సినిమా పేరు కూడ ఆ రెస్టారెంట్ పేరే, "The Ramen Girl".
రామెన్ సూప్ మొదట చైనా వంటకం క్రమంగా ఇది జపాన్ దేశంలో కూడ మంచి వంటకంగా విస్తరించింది .
నాకు సినిమా చూస్తున్నంత సేపు నా జిహ్వా చాపల్యాన్ని ఓర్పుతో నిలుపుకున్నాను, ఇంక నా వల్ల కాదు, నేను ఈ వంటకాన్ని రుచి చూడాల్సిందే..నా రూంకి దగ్గరలో చైనీస్ రెస్టారెంట్ "Bowl O China" వుంది, వెంటనే ఈ రోజు వెళ్ళి దీని సంగతేంటో చూడాల్సిందే .

మరి వుంటానండి ....!!!!!!   ;-)