Wednesday, September 29, 2010

అర్జునా...ఫల్గుణా ..!"

                         

       నిన్న రాత్రి భోజనం పార్శిల్ తీసుకొని రావడానికని మా స్నేహితుడితో కలసి అలా రూం నుండి బయటకి వచ్చాము ..వెళ్ళి పార్శిల్ తీసుకొని రూం కి తిరుగు ముఖం పట్టాము ఇంతలో చినుకులు పడుతున్నాయి..చిన్న వానేగా అని కొంతదూరం నడిచాము ఇంతలో వర్షం బాగ పడటం మొదలెట్టింది...ఓ ఇంటి ముందు తడవకుండా వుండడానికని నిలబడ్డాము ..వర్షం చాలా జోరుగా ఫడుతుంది, గట్టిగ ఒక పెద్ద ఉరుము శబ్దం వినిపించింది ...చిన్న పిల్లలు గాని వినుంటే ఖచ్చితంగా బయపడేవాళ్ళు..ఇంతలో పక్కనే వున్న మా వాడి నుండి ఓ సనుగుడు వినిపించింది..సరిగ్గ వినలేదు, "ఏంటి అంటున్నావు..?" అని అడిగాను , వాడు నవ్వుకుంటూ.. "అర్జునా..! ఫల్గుణా..!" అని అన్నాడు..., సరే దానర్దం తెలుకుందామని వాడిని అడిగితే, " నాకు కూడ తెలీదు మా అవ్వగారు అలా అంటుండే వారు" అని చెప్పుకొచ్చాడు.

           అలా నాకు ఒక సమాధానం లేని ప్రశ్నని మిగిల్చాడు.

           అసలు "అర్జునా...ఫల్గుణా ..!" అని ఉరుము పడినప్పుడు ఎందుకు అంటారు...?

Wednesday, September 22, 2010

వినియోగం - దుర్వినియోగం


ఓ రోజు బుద్దుడు భోది వృక్షం కింద కూర్చుని లోకానికి తన సిద్దాంతాలని బోదించి మానవ జాతికి పరమార్దాన్ని ఎలా తేలియ జేయాలో తీక్షణం గా ఆలోచిస్తున్నాడు.

ఇంతలో కొంతమంది శిష్యులు తన దగ్గరికి వచ్చి, "గురువర్యా..!,మా నుండి చిన్న విన్నపం..!" అని వివరిస్తారు.

బుద్దుడు: "చెప్పండి..నేను మీకు ఏమి సహాయం చేయగలను ?"

శిష్యుడు: "మా ఈ దుస్తులు చిరిగిపోయినవి, తమరు దయ వుంచి మాకు క్రొత్త దుస్తులు ఇప్పించగలరు"

బుద్దుడు ఇంతలో వారికి కొత్త దుస్తుల్ని దుకాణం నుండి తెప్పించి ఇస్తాడు.

అవి తీసుకొని శిష్యులు అక్కడి నుండి సెలవు తీసుకుంటారు,

కాని బుద్దుడు వారి అవసరాన్ని మాత్రమే తీర్చానని ఆలోచిస్తూ ఏదో వెలితిని సంగ్రహించాడు,
తిరిగి శిష్యులు వుండే గదులకి వెళ్ళి,"కొత్త దుస్తులతో మీరు సంతోషమేనా?" అని అడుగుతాడు.
శిష్యులు: "సంతోషమే గురువర్యా..!"

బుద్దుడు: "మీరు కొత్త దుస్తుల్ని తీసుకొని,పాత దుస్తుల్ని ఏమి చేసారు?  "
శిష్యులు: "పాత బట్టల్ని నేలపై పడుకోవడానికి దుప్పటిలా ఉపయోగిస్తున్నాము గురువర్యా..! "

బుద్దుడు: "మరి పాత దుప్పటి ఏమి చేసారు..! "
శిష్యులు:  "పాత దుప్పటిని కిటికీకి తెరలా ఉపయోగిస్తున్నాము..!"

బుద్దుడు: " మరి పాత కిటికీ తెర ఏమి చేసారు"
శిష్యులు: " పాత కిటికీ తెరని వంట గదిలో వేడిగా వున్న పాత్రల్ని పట్టుకోవడంలో ఉపయోగిస్తున్నాము ...!"

బుద్దుడు: " మరి ముందుటి బట్ట..?"

శిష్యులు: "ఆ బట్టని నేలని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్నాము ..! "

బుద్దుడు: " మరి ఈ బట్ట..?"

శిష్యులు: " బాగా చిరిగి పోయిన ఈ బట్టని ఏమి చేయాలో అర్దం కాలేదు, వీలుఫడితే దీన్ని దీపంలో ఒత్తిలా ఉపయోగించవచ్చు. "

బుద్దుడు, ఒక్కసారిగా తన శిష్యుల సమాధానంతో ఆనందపడి అక్కడినుండి వెళ్ళిపోతాడు.

ఒక వేళ బుధ్ధుని శిష్యులు ఇంతకంటే ఉపయోగకరమైన సమాధానం ఇచ్చి వుండక పోయి ఉంటే బుధ్ధుడు కలత చెంది వుండేవాడు, కాని తన బోదనలు శిష్యులకి సరిగ్గా  చేరుతున్నాయని సంతోషించాడు.

Wednesday, September 1, 2010

ఎందుకు?? ఎందుకు??


  • టి.వి రిమోట్ కంట్రోల్ లో బ్యాటరీలు లేవని తెలిసినా ఎందుకు గట్టిగా పదే పదే నొక్కుతారు.
  • బ్యాంక్ అకౌంట్ లో తక్కువ మొత్తంలో నగదు వుందని తెలిసినా కూడా బ్యాంక్ లు ఎందుకు అదనపు చార్జీల మోత వేస్తాయి.
  • ఎవరైనా ఆకాశంలో నాలుగు బిలియన్ల సంఖ్యలో నక్షత్రాలు వుంటాయి అని అంటే.. అతన్ని ప్రశ్నించక గుడ్డిగా ఎందుకు నమ్ముతారు.
  • టార్జాన్ కి గడ్డం ఎందుకు వుండదు.
  • సూపర్ మాన్ వేగవంతమైన బుల్లెట్లని తన చాతితో సులువుగా ఆపగలడు కాని అదే గన్ ని తిప్పి తన తల పై మోదితే ఎందుకు పడిపోతాడు.
  • చాలా మంది ఇంటి ఫ్రిజ్ లో ఏమీ లేవని తెలిసి కూడ పదే పదే అందులో ఏదో వున్నట్లు ఫ్రిజ్ తలుపు తీసి ఎందుకు వెతుకుతారు.
  • పొరపాటున టేబుల్ పైన వస్తువు ని కిందకు పడకుండా పట్టుకోవడం లో విఫలమైతే మళ్ళీ మనమే ఎందుకు ఇంకో వస్తువుని చిరాకుతో క్రింద పడెయ్యటానికి ప్రయత్నిస్తాము.
     నా ఉద్దేశం... ఈ మధ్య నాకర్ధం కాని కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుదామని .... అంతే !!!