Thursday, August 26, 2010

నేను సంపాదించిన స్వచ్చమైన తెలుగు సామెతల సమాహారం...!


* అంగడి అమ్మి, గొంగళి కొన్నట్లు.
* అంచు డాబే గానీ, పంచె డాబు గాదు.
* అంధునకు అద్దము చూపినట్లు.
* అంకె లేని కోతి లంకంతా చెరచిందట.
* అంగట్లో అన్నీ ఉన్నా - అల్లుడి నోట్లో శని వుంది !
* అంగట్లో అరువు - తలమీద బరువు లాంటిది
* అంగడిలో దొరకనిది - అమ్మ ఒక్కటే !
* అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకున్ఠం.
* అగ్నికి వాయువు తొడైనట్లు.
* అంచులేని గిన్నె - అదుపులేని పెళ్ళాం !
* అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత!
* అంతా మన మంచికే
* అంతా మావాళ్లేగాని - అన్నానికి రమ్మనేవాళ్లులేరు !
* అంత్య నిష్టూరంకన్నా - ఆది నిష్టూరం మేలు !
* అందని ద్రాక్షపండ్లు - పుల్లన!
* అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట.
* అందితే జుట్టు అందక పోతే కాళ్ళు.
* అందరూ ఎక్కేవాళ్ళయితే మోసేవాళ్ళెవరు! 

                                               మరిన్ని సామెతలు..

Friday, August 6, 2010

చార్మినార్ ఒక అద్భుత కట్టడం ...!



క్రిందటి వారాంతం సరదాగ మా స్నేహితులతో కలసి హైదరాబాదులో చార్మినార్ కి వెళ్ళాం....,

ఆ రోజు, అక్కడ, ప్రతి ప్రదేశం  మాకు మంచి అనుభూతిని కలిగించింది,
మొదటగా కార్ పార్క్ చేయడానికి ఆ ఇరుకు రోడ్ల పై మేము పడిన తంటాలు అన్ని ఇన్ని కాదు..,

చార్మినార్ కి ఎదురుగా వున్న నిజాం టి.బి హాస్పిటల్లో పార్క్ చేయమని ఎవరో అంటే విని వెళ్ళి కార్ పార్క్ చేసాము..

అక్కడినుండి ఇంక ఫారెన్ కంట్రీ నుండి వచ్చిన విదేశీయుల్లా.. మేము చేతిలో కెమరాలు పట్టుకుని కాసేపు హడావిడి చేసాము, కాని అక్కడ వున్నంతసేపు ఏదో అభద్రతా బావం ఎవరన్న వచ్చి ఏమన్నా చేస్తారేమో అని.

 కాని ఆ కట్టడం చాలా  అద్భుతమైనది, హైదరాబాద్ అంటే ఒకప్పుడు అందరికీ గుర్తొచ్చేది చార్మినారే ..అప్పటినుండి నాకు.. "ఇన్ని రోజులు నుండి హైదరాబాదులో వున్నా ఈ ప్రదేశం చూడలేక పోతున్నామే" అని ఓ కోరిక మిగిలిపోయింది. కాని ఈ రోజుతో ఆ కోరిక పూర్తి కాబోతుంది అని ఆనందం.
   
అప్పటికే మేము వెళ్ళిన సమయం సాయంత్రం 4.30 గం||లు, ఓ గంట సేపు చార్మినారు, మేము ఫోటోలు దిగి చివరికి అలసిపోయి పక్కనే వున్న "ఓ" కేఫ్ కి వెళ్ళాము, ఈ కేఫ్ లో ఓ ప్రత్యేకత వుంది, ఇక్కడ టీ (చాయ్) ఎంత త్వరగా సప్లయ్ చేస్తారంటే.. ఇలా డబ్బులు ఇస్తే అలా టీ వచ్చేస్తుంది కిక్కిరిసే జనంతో అంతా బిజీ బిజీ గా వుంది ఆ కేఫ్  ..వీళ్ళ ఆదాయం ఎంత ఎక్కువ వుంటుందో వేరే చెప్పనక్కర్లేదు, అలా కాసేపు టీ చేతిలో పట్టుకుని  ఆ అద్భుతమైన కట్టడాన్ని (చార్మినార్) వీక్షిస్తూ రెండు టీలు లాగించేసాము.


ఇంక మళ్ళీ అక్కడినుండి మొదలయ్యి చార్మినార్ కి ఓ పక్క వీదిలోకి వెళ్ళాము.. ఆ వీది అంతా పూర్తిగా గాజుల అంగళ్ళతో మెరిసిపోతుంది, ఎన్ని అంగళ్ళో ..అలా చూస్తే అంగళ్ళలోనికి పిలుస్తున్నారు అంగళ్ళ యజమానులు.  కాని ఆ గాజుల  అంగళ్ళతో మాకేం పని అని అటూ ఇటూ చూడకుండ వచ్చేసాము కాని అక్కడ ఆ అంగళ్ళ వరుస చాల అందంగా కనిపించాయి మాకు.

అక్కడి నుండి ఇంకాస్త ముందుకి వస్తే ఆ వీధి అంతా అత్తరు వాసన, ఓ మంచి అత్తరు దుఖాణం కనిపిస్తే,
మావాడు ఒకడు తీసుకుందాము అంటేను సరే బేరం చేయడం మొదలు పెట్టాము, ఓ పట్టాన వాడు వినకున్నా 100/- కి 50/- అడుగుతూ బేరం చేసి మంచి అత్తరు సీసా ఒకటి కొన్నాము. కాస్త ముందుకి వెళ్ళాక అక్కడ రోడ్ పైన ఓ ముసలి అతను నిలబడి ఏవో కొన్ని సీసాలు కింద పెట్టి అమ్ముతున్నాడు, ఏంటా అవి చూస్తే అప్పటికి గాని అవి అనిపించలేదు సెంటు బాటిల్లు అని ఏవైన తీసుకొండి 100/- మాత్రమే అంటున్నాడు, అక్కడ వున్నంతసేపు మా పైన సెంటు వర్షం కురిపించాడు.. ఇది తీసుకోండి అది తీసుకోండి అంటూ ..మా వాడికి అప్పుడు మొదలైన తుమ్ములు ఒక్క రోజుక్కాని ఆగలేదు..హహ్హ హహ్హ..!!.

అలా చార్మినార్ వీదుల్లో తిరిగి తిరిగి మళ్ళీ చార్మినార్ వైపుగా నడిచాము అంత దాక మాకు చార్మినార్లో మాకు కనిపించిన అందం తక్కువే అని చెప్పాలి, రంగుల వెలుగులో దాని అందం ఇంకాస్త రెట్టింపు అయ్యింది ...మళ్ళీ మా కెమెరాలకి పని చెప్పాము......!

తిరిగి తిరిగి బాగ అలసిపోయి ఆకలి వేసి ఏదన్నా తిందామని వెతికితే చార్మినార్ కి ముందు ఓ పక్క చిన్న టిఫిన్ కొట్టు కనిపిస్తే అలా రోడ్ పైనే చైర్ లు వేసుకొని కూర్చుని టిఫిన్ లాగించేసాము. .మళ్ళీ తిరిగి పార్క్ చేసిన కార్ ని తీసుకొని రావడానికి వెళ్ళాము, గంటకి 20/-రు|| లు చొప్పున రెండు గంటలకి 40 రు||లు చార్జీ చేసాడు అక్కడి పార్కింగ్ యజమాని. అక్కడి మొదలు నాంపల్లి కరాచి బేకరీ కి వెళ్ళి కాసేపు రూంలోకి కావలసిన బేకరీ ఫుడ్ కొనుక్కొని తిన్నగా రూం కి చేరాము ..అలా ఒక వారాంతం మాకు చార్మినార్ ప్రాంతం ఒక మంచి విడిదిగా అయ్యింది.... !