Wednesday, September 1, 2010

ఎందుకు?? ఎందుకు??


  • టి.వి రిమోట్ కంట్రోల్ లో బ్యాటరీలు లేవని తెలిసినా ఎందుకు గట్టిగా పదే పదే నొక్కుతారు.
  • బ్యాంక్ అకౌంట్ లో తక్కువ మొత్తంలో నగదు వుందని తెలిసినా కూడా బ్యాంక్ లు ఎందుకు అదనపు చార్జీల మోత వేస్తాయి.
  • ఎవరైనా ఆకాశంలో నాలుగు బిలియన్ల సంఖ్యలో నక్షత్రాలు వుంటాయి అని అంటే.. అతన్ని ప్రశ్నించక గుడ్డిగా ఎందుకు నమ్ముతారు.
  • టార్జాన్ కి గడ్డం ఎందుకు వుండదు.
  • సూపర్ మాన్ వేగవంతమైన బుల్లెట్లని తన చాతితో సులువుగా ఆపగలడు కాని అదే గన్ ని తిప్పి తన తల పై మోదితే ఎందుకు పడిపోతాడు.
  • చాలా మంది ఇంటి ఫ్రిజ్ లో ఏమీ లేవని తెలిసి కూడ పదే పదే అందులో ఏదో వున్నట్లు ఫ్రిజ్ తలుపు తీసి ఎందుకు వెతుకుతారు.
  • పొరపాటున టేబుల్ పైన వస్తువు ని కిందకు పడకుండా పట్టుకోవడం లో విఫలమైతే మళ్ళీ మనమే ఎందుకు ఇంకో వస్తువుని చిరాకుతో క్రింద పడెయ్యటానికి ప్రయత్నిస్తాము.
     నా ఉద్దేశం... ఈ మధ్య నాకర్ధం కాని కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుదామని .... అంతే !!!

5 comments:

కృష్ణప్రియ said...

నిజమే.. టార్జాన్ కి గడ్డం ఎందుకుండదు? :-) బాగుంది.

నాకూ ఒక అనుమానం.. సినిమాల్లో, టీ వీ, రామాయణాల్లో ఆడ వానరులకి మర్కట లక్షణాలెందుకుండవు?

Kiran Teja Avvaru said...

మీకు వున్నాయి సందేహాలు అయితే బ్లాగుల్లో ఎక్కుపెట్టండి !!

..nagarjuna.. said...

నాకూ ఒక అనుమానం, మీ బ్లాగు ఫీడ్స్ కోసం ప్రయత్నిస్తుంటే ’లేఖిని’కి ఎందుకు redirect అవుతుంది..?

Kiran Teja Avvaru said...

@ నాగార్జున:కాస్త వివరంగా చెప్పగలరు.

భాస్కర రామిరెడ్డి said...

kiranteja గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు

హారం

Post a Comment