Friday, June 25, 2010

తిట్లదండకం

బ్లాగుల్లో అనవసరంగా,నచ్చని విధంగా విమర్శిస్తూ కామెంట్స్ ఇచ్చే ప్రతి ఒక్కరికి నా ఈ తిట్లదండకం అంకితం...!
మిమ్మల్ని 100 అంతస్తుల మేడనుండి తోసెయ్య,
నీళ్ళు లేని బావిలొకి మీకు తెలియకుండా కళ్ళు మూయించి డైవ్ వేయించా,
పంట పొలాల్లో దిష్టి బొమ్మలకి బదులు మిమ్మల్ని వేలాడదీయ,
పబ్లిక్ ఎక్షాంలో నీ పెన్నుకి ఇంకు అయ్యిపొయి ఎవ్వరూ పెన్ను ఇవ్వక చావ,
టికెట్ లేకుండా వెళ్ళిన రోజు బస్సులో టికెట్ కల్లెక్టర్ కి నువ్వు చిక్క,
మండుటెండలో తాటి చేట్టుకి వేలాడదీయ,
2 నెలలనాటి మాడిపోయిన మసాల దోసె నీ మొహాన కుక్క,
మీ పాస్ వర్డ్స్ ఎవరో ఒకరు కొట్టేసి నీ పర్సనల్ డాటా తో మిమ్మల్ని బ్లాక్ మైల్ చెయ్యా,
రైల్వే ట్రాక్ పైన మిమ్మల్ని రోడ్ రోలర్ తో తొక్కి పడెయ్య,
మాంచి ఒంగోల్ ఎద్దులు పొడవాటి కొమ్ములతో గురిచూసి నిన్ను కుమ్మేయ..
చెప్పులు లేకుండా తారు రోడ్డు పైన 48డిగ్రీల ఎండకి ఒక గంట సేపు నడిపించ..,
పారిపోతున్న దొంగని వదిలేసి పోలీసులు నిన్ను పట్టుకోని దొంగ అనుకుని ఉతికి ఆరెయ్యా..వీలైతే ఎన్ కౌంటర్ చెయ్య..,
అంతవరకూ సంపాదించిన సంపాదనంతా బ్యాంక్ నుండి తీసుకొస్తుండగా దొంగ వెదవ కొట్టేసెయ్య..!

ఇంకా తిట్టాలని వుంది కాని...,నాకు ఓపిక లేదు..మంచి కంటే ముందు చెడు చాలా త్వరగా విస్తరిస్తుంది ..అలాగే బ్లాగుళ్ళొ తమ తమ ఉనికిని తెలియజేయడానికి చెడుగా రాసే ప్రతి ఒక్కరికి నా ఈ తిట్లదండకం అంకితం...!,మిమ్మల్ని మార్చే శక్తి నాకు లేదు కనీసం ఒక్కరు మారినా నాకు తృప్తే. నాయీ చిన్న హాస్య దండకం కొంతమంది నైనా మారుస్తుందని ఆశిస్తూ..!

Wednesday, June 23, 2010

త్రాగుడెంత పని చేసే నారాయణా...!


త్రాగుడెంత పని చేసే నారాయణా...!

చెప్పేవాడికి వినే వాడు లోకువ అన్నట్లు ..!

మహిళా లోకం..!

ఒక అబ్బాయి క్లాసుకి ఆలస్యంగా వచ్చాడంటే "కాలం ఎవ్వరికోసం ఆగదు కాలాన్ని వృధా చేయకు ..!" అంటూ అందరూ అతనికి హితభోద చేస్తారు, అదే అమ్మాయి ఆలస్యంగా వస్తే "బస్సు లేట్ అయ్యుంటుందిలే పాపం" అంటారు.


అమ్మాయి అబ్బాయిలా దుస్తులు ధరిస్తే అమ్మాయి ప్యాషన్ గా వుంది అని పొగుడుతారు కాని అదే అబ్బాయి అమ్మాయిలా తయారయ్యితే ఎక్కడి జూ నుండి పారిపొయి వచ్చాడు అంటారు.


అబ్బాయి అమ్మాయితో మాట్లాడితే తను ఆ అమ్మాయికి సైట్ కొడుతున్నాడు అంటారు,అదే అమ్మాయి అబ్బాయితో మాట్లాడితే ఆ అబ్బాయితో స్నేహం గా వుంది అంటారు.
 
ఒక అమ్మాయి ఏడుస్తుంటే అందరూ తనని ఓదార్చడానికి ప్రయత్నిస్తారు, కాని అదే ఒక అబ్బాయి ఏడిస్తే ఏంటా ఏడ్పు అమ్మాయిల్లాగా..! అంటూ అవహేళన చేస్తారు.
 
రోడ్ పైన అమ్మాయి ఏదన్నా యాక్సిడెంట్ చేస్తే అవతలి వాళ్ళది తప్పు అని సర్ది చెబుతారు, అదే అబ్బాయి గనుక చేస్తే నువ్వు సరిగ్గ డ్రైవింగ్ చేయలేదు అని అంటారు.

సిటీ బస్ లో అబ్బాయి అమ్మాయిల సీట్లలో కూర్చుంటే అబ్బాయికి బుద్ది,జ్ఞానం లేనట్టున్నాయి అని చెబుతారు అదే అమ్మాయి అబ్బాయిల సీట్లో కూర్చుంటే " స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం" అని వూరుకుంటారు.

ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి రాంక్ వచ్చినా ఇంకా మంచి రాంక్ వచ్చుండేది ప్రయత్నించుంటే అనే వారు,అదే అమ్మాయి అయితే ఏం కంగారు పడకు లేడీస్ కి 30% రిజర్వేషన్ వుంది కదా అంటూ ఓదారుస్తారు.

క్లాస్ లో అమ్మాయిలు వుంటే మాస్టరుకి రోజూ పాఠాలు చెప్పడానికి ఆసక్తి వుంటుంది అదే అబ్బాయిలు ఒక్కటే వుంటే ఆ రోజు క్లాస్ ఏమి లేదు అని మొహం తిప్పేస్తారు.

అయితే..!

ప్రపంచమంలోని మనుషులంతా ఒకే భాష, ఒకే కులం, ఒకే జాతితో చలామణి అయితే..,


స్వర్గం నుండి దేవుళ్ళు దిగి వచ్చి వాళ్ళ వాళ్ళ గుళ్ళలో విగ్రహాలకి బదులు వాళ్ళే నిలబడి భక్తులకి వరాలిస్తే...,


మనిషి రోజుకి ఒక్క పూటే తినే అలవాటు వుంటే..,


ప్రతి వ్యక్తి నెల వారి సంపాదనకి ప్రభుత్వం ఒక పరిమితి విధించి ఏ పని చేసినా ఒకే జీతం కేటాయిస్తే..,


భూమి తనచుట్టూ తాను తిరగడానికి 365 రోజుల సమయం పడితే..,

అబధ్ధాలు చెప్పని,మోసాలు చెయ్యని మనుషులకి మాత్రమే భూమి ప్రవేశం కల్పిస్తే...,


 జంతువులు అడవులు వదిలి మనుషులతో కలిసిపోయి స్నేహంగా మానవ సంచార ప్రదేశాల్లో సంచరిస్తే..,


భూమి పై ఒకే ఒక్క రకపు చెట్లకి సంవత్సరంలో నెలకొక్క రకం చొప్పున పన్నెండు రకాల పండ్లని ఇస్తే..,


విమానాలకి బదులు మేఘాలు మనుషుల్ని మోసుకెల్తే ..,


బంగారం,వెండి కూడా ఇత్తడి,రాగిలా సమానంగా తక్కువ ధరకి వీధుల్లో నాలుగు చక్రాల బండ్ల పైన అమ్మితే..,


ప్రతి ఒక్కరికి తమని పెళ్ళాడబోయే అమ్మాయి, చిన్నప్పటి నుండి తమతో స్నేహంగా మెదిలితే ..!

Friday, June 4, 2010

మేము - ఆదివారం - విధి


       చివరి ఆదివారం, సాయంత్రం హైదరబాదులో, మా రూంలో ఒకటే బోర్ కొడుతుందని అలా బయటికి వెళ్దామని నేను, నా మిత్రులు 7గంటల ప్రాంతంలో ఒక్క బైక్ లో ముగ్గురం GVK మాల్ కి బయలుదేరాము.
    
      మేము వుండేది బల్కంపేట అక్కడినుండి ఆ మాల్ కి పంజగుట్ట మీదుగా వెళ్ళాలి. పంజాగుట్ట దాక ముగ్గురం బాగానే వెళ్ళాం ట్రాఫిక్ పోలీస్ ల కంట పడకుండా.  పంజగుట్ట సిగ్నల్ పడగానే రెప్ప పాటులో మా ముందు ట్రాఫిక్ పోలీస్ ప్రత్యక్షమయ్యాడు.


     తను చాల దురుసుగా "దిగండి మా సార్ అక్కడ వున్నాడు వెళ్ళి కలవండి..!" అంటూ అరిచాడు. మా వాడు బైక్ దిగకుండా అలానే బైక్ పైనే అతని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసాడు.ఆ పోలిస్ మళ్ళీ వచ్చి గొడవ పడ్డాడు "అలా వెళ్ళ కూడదు ...!" అని.  దీంతో మా వాడికి చిరాకొచ్చి  తనతో  "మా ఇష్టం" అంటూ ఆ పోలీస్ కి తిరిగి సమాధానం ఇచ్చాడు. "ఏమి కాదులే" అంటూ మాకు చెబుతూ, వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు మా వాడు.


      అలా కాసేపు ఎప్పుడూ బిజీగా వుండే  పంజాగుట్ట ట్రాఫిక్ సెంటర్లో గడిపాము, కాసేపయ్యాక తను నవ్వుకొంటూ వచ్చి "పదండి వెళ్దాం..!" అంటూ బైక్ స్టార్ట్ చేసాడు. బైక్ లో వెళ్తూ "ఏమి చేసావురా..!" అని అడిగితే, "ఏంలేదురా నేను జూబ్లిహిల్ల్స్ లో M.L.A ప్రతాప్ రెడ్డి బంధువులమని, అర్జెంట్ గా పని పడితే ముగ్గురం వేరే బైక్ లేక వెళ్తున్నామని చెప్పాను, అంతే తను నన్ను ఓ V.I.P లా చూసి వదిలేసాడు" అంటూ నవ్వాడు.  అక్కడినుండి GVK వన్ మాల్ కి వెళ్ళి, బైక్ ని ఏదో సాధించామన్న హడావిడిలో మాల్ కి  బయటే పార్క్ చేసాము.


    రెండు గంటలు మాల్ లోపల అంతా బాగ తిరిగి తిరిగి అలిసిపోయి ఇంక రూంకి వెళ్దామని నిర్ణయించుకొని..మాల్ కి బయటికి వచ్చి బైక్ కోసం వెతుకులాడాము, గుండె ఆగినంత పని అయ్యింది, తన బైక్ కనిపించకుండా పొయింది..,మా వాడిని ఆపడం మా వల్ల కాలేదు,వాడికి బి.పి వచ్చినంత పని అయ్యింది.
 ఇంతలో ఒక వ్యక్తి "ఏమైంది బాబు ..!" అంటూ  మా దగ్గరికి వచ్చాడు, జరిగిందంతా చెప్పాము. "ఇందాక ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఏవో కొన్ని బైక్ లని సరిగ్గా పార్క్ చేయలేదని పట్టుకెళ్ళిపోయారు స్టేషన్ కి, మీవీ అందులో వున్నాయేమో, వెళ్ళి చూసుకొండి...!" అని తను చెప్పగానే మళ్ళి అంత వరకు ఊపిరిపోయినట్లు వున్న మా వాడికి ఊపిరొచ్చినంత పని అయ్యింది. ముగ్గురం హూటహూటిన ఒక ఆటో ని పట్టుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము .


అక్కడున్న బైక్ లలో మా వాడి బైక్ ని చూసి కష్టం నుండి బయట పడ్డాము అని దేవునికి థాంక్స్ చెప్పుకున్నాము..!. ట్రాఫిక్ పోలీస్ లకి 300/- ఫైన్ గా కట్టి బైక్ ని తిరిగి తీసుకొన్నాము. ఇక్కడ విషయం ఏమిటంటే సరిగ్గా రెండు గంటల క్రితమే ఆ ప్రదేశానికి దగ్గరలోనే ట్రాఫిక్ పోలిస్ కి ఫైన్ కట్టకుండా అబద్దం చెప్పి తప్పించుకున్నాము, మళ్ళీ ఈ రూపంలో ఇంత త్వరగా ఈ ప్రదేశంలో  చిక్కుతామని అస్సలు ఊహించలేదు, ఆ రోజు  నాకైతే ఒక్కటి స్పష్టంగా అర్దం అయ్యింది "విధి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు ..!" అని.