Wednesday, June 23, 2010

అయితే..!

ప్రపంచమంలోని మనుషులంతా ఒకే భాష, ఒకే కులం, ఒకే జాతితో చలామణి అయితే..,


స్వర్గం నుండి దేవుళ్ళు దిగి వచ్చి వాళ్ళ వాళ్ళ గుళ్ళలో విగ్రహాలకి బదులు వాళ్ళే నిలబడి భక్తులకి వరాలిస్తే...,


మనిషి రోజుకి ఒక్క పూటే తినే అలవాటు వుంటే..,


ప్రతి వ్యక్తి నెల వారి సంపాదనకి ప్రభుత్వం ఒక పరిమితి విధించి ఏ పని చేసినా ఒకే జీతం కేటాయిస్తే..,


భూమి తనచుట్టూ తాను తిరగడానికి 365 రోజుల సమయం పడితే..,

అబధ్ధాలు చెప్పని,మోసాలు చెయ్యని మనుషులకి మాత్రమే భూమి ప్రవేశం కల్పిస్తే...,


 జంతువులు అడవులు వదిలి మనుషులతో కలిసిపోయి స్నేహంగా మానవ సంచార ప్రదేశాల్లో సంచరిస్తే..,


భూమి పై ఒకే ఒక్క రకపు చెట్లకి సంవత్సరంలో నెలకొక్క రకం చొప్పున పన్నెండు రకాల పండ్లని ఇస్తే..,


విమానాలకి బదులు మేఘాలు మనుషుల్ని మోసుకెల్తే ..,


బంగారం,వెండి కూడా ఇత్తడి,రాగిలా సమానంగా తక్కువ ధరకి వీధుల్లో నాలుగు చక్రాల బండ్ల పైన అమ్మితే..,


ప్రతి ఒక్కరికి తమని పెళ్ళాడబోయే అమ్మాయి, చిన్నప్పటి నుండి తమతో స్నేహంగా మెదిలితే ..!

2 comments:

Suriii said...

ఈ లోకం మొత్తం ఈ పాటలాగా , నీ బ్లాగ్ వాఖ్యలలాగా మారిపోతే ఎంత బాగుంటుంది...
కొత్త బంగారు లోకం..మాకు కావాలి సొంతం..
గాలి పాడాలి గీతం.. పుడమి కావాలి స్వర్గం..

కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం

జంట నెలవంకలుండే నింగి కావాలి మాకు
వెండి వెన్నెల్లలోనే వెయ్యి కలలు పండాలి మాకు
పువ్వులే నోరు తెరిచి మధుర రాగాలు నేర్చి
పాటలే పాడుకోవాలి అది చూసి నే పొంగిపోవాలి
మనసనే ఒక సంపంద ప్రతి మనిషిలోను ఉండనీ
మమతలే ప్రతి మనసులో కొలువుండనీ
మనుగడే ఒక పండగై కొనసాగనీ
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం

ఓడిపోవాలి స్వార్ధం ఇల మరిచిపోవాలి యుద్ధం
మరణమే లేని మానవులే ఈ మహిని నిలవాలి కలకాలం
ఆకలే సమసిపోనీ అమృతం పొంగిపోనీ
శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడని ప్రతి నిత్యం
వేదనే ఇక తొలగనీ వేడుకే ఇక వెలగనీ
ఎల్లలా పోరాటమే ఇక తీరనీ ఎల్లరూ సుఖశాంతితో ఇక బతకనీ
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం

శివరంజని said...

ఎంత స్వార్ధం లేకుండా కోరుకున్నారండీ . ఈ లోకం మొత్తం మీ పోస్ట్ లా అయిపోతే ఎంత బావుంటుందో

Post a Comment