Friday, June 4, 2010

మేము - ఆదివారం - విధి


       చివరి ఆదివారం, సాయంత్రం హైదరబాదులో, మా రూంలో ఒకటే బోర్ కొడుతుందని అలా బయటికి వెళ్దామని నేను, నా మిత్రులు 7గంటల ప్రాంతంలో ఒక్క బైక్ లో ముగ్గురం GVK మాల్ కి బయలుదేరాము.
    
      మేము వుండేది బల్కంపేట అక్కడినుండి ఆ మాల్ కి పంజగుట్ట మీదుగా వెళ్ళాలి. పంజాగుట్ట దాక ముగ్గురం బాగానే వెళ్ళాం ట్రాఫిక్ పోలీస్ ల కంట పడకుండా.  పంజగుట్ట సిగ్నల్ పడగానే రెప్ప పాటులో మా ముందు ట్రాఫిక్ పోలీస్ ప్రత్యక్షమయ్యాడు.


     తను చాల దురుసుగా "దిగండి మా సార్ అక్కడ వున్నాడు వెళ్ళి కలవండి..!" అంటూ అరిచాడు. మా వాడు బైక్ దిగకుండా అలానే బైక్ పైనే అతని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసాడు.ఆ పోలిస్ మళ్ళీ వచ్చి గొడవ పడ్డాడు "అలా వెళ్ళ కూడదు ...!" అని.  దీంతో మా వాడికి చిరాకొచ్చి  తనతో  "మా ఇష్టం" అంటూ ఆ పోలీస్ కి తిరిగి సమాధానం ఇచ్చాడు. "ఏమి కాదులే" అంటూ మాకు చెబుతూ, వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు మా వాడు.


      అలా కాసేపు ఎప్పుడూ బిజీగా వుండే  పంజాగుట్ట ట్రాఫిక్ సెంటర్లో గడిపాము, కాసేపయ్యాక తను నవ్వుకొంటూ వచ్చి "పదండి వెళ్దాం..!" అంటూ బైక్ స్టార్ట్ చేసాడు. బైక్ లో వెళ్తూ "ఏమి చేసావురా..!" అని అడిగితే, "ఏంలేదురా నేను జూబ్లిహిల్ల్స్ లో M.L.A ప్రతాప్ రెడ్డి బంధువులమని, అర్జెంట్ గా పని పడితే ముగ్గురం వేరే బైక్ లేక వెళ్తున్నామని చెప్పాను, అంతే తను నన్ను ఓ V.I.P లా చూసి వదిలేసాడు" అంటూ నవ్వాడు.  అక్కడినుండి GVK వన్ మాల్ కి వెళ్ళి, బైక్ ని ఏదో సాధించామన్న హడావిడిలో మాల్ కి  బయటే పార్క్ చేసాము.


    రెండు గంటలు మాల్ లోపల అంతా బాగ తిరిగి తిరిగి అలిసిపోయి ఇంక రూంకి వెళ్దామని నిర్ణయించుకొని..మాల్ కి బయటికి వచ్చి బైక్ కోసం వెతుకులాడాము, గుండె ఆగినంత పని అయ్యింది, తన బైక్ కనిపించకుండా పొయింది..,మా వాడిని ఆపడం మా వల్ల కాలేదు,వాడికి బి.పి వచ్చినంత పని అయ్యింది.
 ఇంతలో ఒక వ్యక్తి "ఏమైంది బాబు ..!" అంటూ  మా దగ్గరికి వచ్చాడు, జరిగిందంతా చెప్పాము. "ఇందాక ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఏవో కొన్ని బైక్ లని సరిగ్గా పార్క్ చేయలేదని పట్టుకెళ్ళిపోయారు స్టేషన్ కి, మీవీ అందులో వున్నాయేమో, వెళ్ళి చూసుకొండి...!" అని తను చెప్పగానే మళ్ళి అంత వరకు ఊపిరిపోయినట్లు వున్న మా వాడికి ఊపిరొచ్చినంత పని అయ్యింది. ముగ్గురం హూటహూటిన ఒక ఆటో ని పట్టుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము .


అక్కడున్న బైక్ లలో మా వాడి బైక్ ని చూసి కష్టం నుండి బయట పడ్డాము అని దేవునికి థాంక్స్ చెప్పుకున్నాము..!. ట్రాఫిక్ పోలీస్ లకి 300/- ఫైన్ గా కట్టి బైక్ ని తిరిగి తీసుకొన్నాము. ఇక్కడ విషయం ఏమిటంటే సరిగ్గా రెండు గంటల క్రితమే ఆ ప్రదేశానికి దగ్గరలోనే ట్రాఫిక్ పోలిస్ కి ఫైన్ కట్టకుండా అబద్దం చెప్పి తప్పించుకున్నాము, మళ్ళీ ఈ రూపంలో ఇంత త్వరగా ఈ ప్రదేశంలో  చిక్కుతామని అస్సలు ఊహించలేదు, ఆ రోజు  నాకైతే ఒక్కటి స్పష్టంగా అర్దం అయ్యింది "విధి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు ..!" అని.

1 comments:

Anonymous said...

Hi Kiran Teja

Mee Blog Chala Bagundi andi .For telugu cinema News, reviews, gallries, Interviews and wallpapers plz watch
telugucinema news

regards
www.cineherald.com

Post a Comment