Friday, June 25, 2010

తిట్లదండకం

బ్లాగుల్లో అనవసరంగా,నచ్చని విధంగా విమర్శిస్తూ కామెంట్స్ ఇచ్చే ప్రతి ఒక్కరికి నా ఈ తిట్లదండకం అంకితం...!
మిమ్మల్ని 100 అంతస్తుల మేడనుండి తోసెయ్య,
నీళ్ళు లేని బావిలొకి మీకు తెలియకుండా కళ్ళు మూయించి డైవ్ వేయించా,
పంట పొలాల్లో దిష్టి బొమ్మలకి బదులు మిమ్మల్ని వేలాడదీయ,
పబ్లిక్ ఎక్షాంలో నీ పెన్నుకి ఇంకు అయ్యిపొయి ఎవ్వరూ పెన్ను ఇవ్వక చావ,
టికెట్ లేకుండా వెళ్ళిన రోజు బస్సులో టికెట్ కల్లెక్టర్ కి నువ్వు చిక్క,
మండుటెండలో తాటి చేట్టుకి వేలాడదీయ,
2 నెలలనాటి మాడిపోయిన మసాల దోసె నీ మొహాన కుక్క,
మీ పాస్ వర్డ్స్ ఎవరో ఒకరు కొట్టేసి నీ పర్సనల్ డాటా తో మిమ్మల్ని బ్లాక్ మైల్ చెయ్యా,
రైల్వే ట్రాక్ పైన మిమ్మల్ని రోడ్ రోలర్ తో తొక్కి పడెయ్య,
మాంచి ఒంగోల్ ఎద్దులు పొడవాటి కొమ్ములతో గురిచూసి నిన్ను కుమ్మేయ..
చెప్పులు లేకుండా తారు రోడ్డు పైన 48డిగ్రీల ఎండకి ఒక గంట సేపు నడిపించ..,
పారిపోతున్న దొంగని వదిలేసి పోలీసులు నిన్ను పట్టుకోని దొంగ అనుకుని ఉతికి ఆరెయ్యా..వీలైతే ఎన్ కౌంటర్ చెయ్య..,
అంతవరకూ సంపాదించిన సంపాదనంతా బ్యాంక్ నుండి తీసుకొస్తుండగా దొంగ వెదవ కొట్టేసెయ్య..!

ఇంకా తిట్టాలని వుంది కాని...,నాకు ఓపిక లేదు..మంచి కంటే ముందు చెడు చాలా త్వరగా విస్తరిస్తుంది ..అలాగే బ్లాగుళ్ళొ తమ తమ ఉనికిని తెలియజేయడానికి చెడుగా రాసే ప్రతి ఒక్కరికి నా ఈ తిట్లదండకం అంకితం...!,మిమ్మల్ని మార్చే శక్తి నాకు లేదు కనీసం ఒక్కరు మారినా నాకు తృప్తే. నాయీ చిన్న హాస్య దండకం కొంతమంది నైనా మారుస్తుందని ఆశిస్తూ..!

6 comments:

జ్యోతి said...

మీ తిట్లదండకం బావుంది కాని మరీ ఇంత సున్నితంగా అష్టొత్తరం చదివితే అలాటి మనుష్యులు మారతారా?? .. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని ఊరకే అన్నారా పెద్దలు.... :)

Sravya V said...

హ హ హ :)

..nagarjuna.. said...

ఏంటి ఈ మాత్రానికే మారాతారనుకున్నారా...తిట్లంటే ప్ర.పీ.స.సం లో ఉన్నట్లు ఉండాలి.
ఏదైతేనేమి మీ దండకం బాగుంది... :)

Kiran Teja Avvaru said...

@జ్యోతి , అంటే నాకు వచ్చిన తిట్లన్ని ఇక్కడ రాస్తే జనం దడుసుకుంటారని నా బాద అంతే ..! కామెంటినందుకు థాంక్స్ ..! :-)

Kiran Teja Avvaru said...

@నాగార్జునా..., ప్ర.పీ.స.సం అంటే...?

శివరంజని said...

హ హ హ :) మీ తిట్లదండకం బావుంది.....

Post a Comment