Wednesday, June 23, 2010

మహిళా లోకం..!

ఒక అబ్బాయి క్లాసుకి ఆలస్యంగా వచ్చాడంటే "కాలం ఎవ్వరికోసం ఆగదు కాలాన్ని వృధా చేయకు ..!" అంటూ అందరూ అతనికి హితభోద చేస్తారు, అదే అమ్మాయి ఆలస్యంగా వస్తే "బస్సు లేట్ అయ్యుంటుందిలే పాపం" అంటారు.


అమ్మాయి అబ్బాయిలా దుస్తులు ధరిస్తే అమ్మాయి ప్యాషన్ గా వుంది అని పొగుడుతారు కాని అదే అబ్బాయి అమ్మాయిలా తయారయ్యితే ఎక్కడి జూ నుండి పారిపొయి వచ్చాడు అంటారు.


అబ్బాయి అమ్మాయితో మాట్లాడితే తను ఆ అమ్మాయికి సైట్ కొడుతున్నాడు అంటారు,అదే అమ్మాయి అబ్బాయితో మాట్లాడితే ఆ అబ్బాయితో స్నేహం గా వుంది అంటారు.
 
ఒక అమ్మాయి ఏడుస్తుంటే అందరూ తనని ఓదార్చడానికి ప్రయత్నిస్తారు, కాని అదే ఒక అబ్బాయి ఏడిస్తే ఏంటా ఏడ్పు అమ్మాయిల్లాగా..! అంటూ అవహేళన చేస్తారు.
 
రోడ్ పైన అమ్మాయి ఏదన్నా యాక్సిడెంట్ చేస్తే అవతలి వాళ్ళది తప్పు అని సర్ది చెబుతారు, అదే అబ్బాయి గనుక చేస్తే నువ్వు సరిగ్గ డ్రైవింగ్ చేయలేదు అని అంటారు.

సిటీ బస్ లో అబ్బాయి అమ్మాయిల సీట్లలో కూర్చుంటే అబ్బాయికి బుద్ది,జ్ఞానం లేనట్టున్నాయి అని చెబుతారు అదే అమ్మాయి అబ్బాయిల సీట్లో కూర్చుంటే " స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం" అని వూరుకుంటారు.

ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి రాంక్ వచ్చినా ఇంకా మంచి రాంక్ వచ్చుండేది ప్రయత్నించుంటే అనే వారు,అదే అమ్మాయి అయితే ఏం కంగారు పడకు లేడీస్ కి 30% రిజర్వేషన్ వుంది కదా అంటూ ఓదారుస్తారు.

క్లాస్ లో అమ్మాయిలు వుంటే మాస్టరుకి రోజూ పాఠాలు చెప్పడానికి ఆసక్తి వుంటుంది అదే అబ్బాయిలు ఒక్కటే వుంటే ఆ రోజు క్లాస్ ఏమి లేదు అని మొహం తిప్పేస్తారు.

7 comments:

Ravi said...

టెంప్లేట్ చాలా బాగుంది.

Harish said...

Very true!

Sravya V said...

ఓహ్ టెంప్లేట్ మార్చేసారా ఇంతకు ముందు ప్రాబ్లం ఉంది కామెంట్ పబ్లిష్ చేద్దామని చూస్తే బటన్ కనపడకుండా దాకున్నేది :)

మాలా కుమార్ said...

పాపం అబ్బాయి కదా .

Kiran Teja Avvaru said...

పాపం అంటే పాపమే మరి..నా ఉద్దేశం అమ్మయిలంతా చెడ్డవాళ్ళని కాదు, అబ్బాయిలంతా మంచి వాళ్ళు అనీ కాదు, నా ప్రయత్నం ఇక్కడ ఒక హాస్యం కోసమే..!

ఆ.సౌమ్య said...

హ హ హ మీ చెయ్యి ఒప్పుకున్నా మనసు ఒప్పుకోవట్లేదు కాబోలు

Prasanthi Viswanadh said...

enti kiran teja ammayilu ante intha kopama.....

Post a Comment