Wednesday, May 26, 2010

మా శ్రీకాళహస్తి "రాజగోపురం" చిత్రాల్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నా..!

చిత్తూరు జిల్లాలో,శ్రీకాళహస్తి అందం,ప్రతిష్ట "రాజగోపురం",అందరి దగ్గర "గాలిగోపురం" గా పిలవబడే ఈ కట్టదం, ఒక్కసారిగా నిన్న(26.05.2010 తేదిన) నేలమట్టం అయ్యింది. ఇది నా మనసును ఎంతగానో కలిచివేసింది ...క్రీ.శ.1516 లో విజయనగర సామ్రాజ్య రాజు శ్రీ కృష్ణ దేవరాయలు గజపతుల పై విజయానికి చిహ్నం గా ఈ అందైన కట్టడాన్ని నిర్మించారు. ఇది 133 అడుగుల ఎత్తు నిర్మాణం.

ఈ సందర్బంలో చివరిగా నేను అందమైన మా ఊరి గాలిగోపుర చిత్రాల్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నా..!







13 comments:

Naganna said...

కిరణ్ గారికి .....నమస్సులు ...!
గత కొద్ది రోజులుగా జ్యోతి లో గోపుర శిథిలావస్థ గురించి వార్తలు చదువుతున్నాం.ఒక్కసారిగా పడిపొయిన వార్త వినగానే ఎక్కడ లేని భాధ మనసులో ఆవరించింది. ఏదో ఏదో కీడు శంకిస్తొంది. కాని ఇంత నిర్లక్ష్యంలొ అధికారులు గాని ప్రభుత్వం గాని వుంటాయని ఊహించలెదు. రాయల వారి చరిత్ర , ఒక హిందు రాజ యొధుడిగా ,ఒక ఆదర్శ సంక్షేమ పరిపాలకుడిగా వారికి సాటి లేరు రారు. వారి పంచ శతి పట్టభిషేక కార్యక్రమాల్ని చాలా ఘనంగా నిర్వహించాం.ఒక జాతి గర్వించదగ్గ విజయ పతాక ఇలా నేల రాలిపొవడం చాల చాలా భాధగావుంది.
ఇది కాకుండా మరేదో మక్కా మసీద్ అయి వుంటే ఈ నాయకులు ఇలా నిర్లక్ష్యం చెసే వారా ? పరుగెత్తి కెళ్ళి పనులు మీదేసుకుని మరీ చేసే వారు !చూసారా ఒక్కడంటె ఒక్కడు కూడా ఇప్పటికి కనీసం స్పందించలేదు ! ఏ డిమాండ్ చేయలేదు !అదీ తేడా .... ఇప్పటికైనా గొపుర పునర్నిర్మానానికి ఆందోళన చేయాఅల్సిందే !

ఆలోచించండి ! మన లాంటి వాళ్ళం ఆ ప్రయత్నం చేద్దాం ..నమస్తే వుంటాను.
మనసాగక నా అభిప్రాయాల్ని మీతొ పంచుకున్నాను మీ సైట్ లొ గొపుర ఫొటో లు చుసాక ఆగలేకపొయాను .

Naganna said...

kirangaaru...if u have interest please visit my site www.mogilipet.blogspot.com. thank you.

durgeswara said...

నిజం చెప్పారు .అదే ఇంకొకటయ్యుంటే .....

Kiran Teja Avvaru said...

chaala baaga comments iccharu thank you so much ..mee site choosaanu..meeru mee peru cheppadam marichipoyaaru....!.

Naganna said...

kiranji ... naa peru nagaraju golkonda.

మురళీ కృష్ణ said...

What happened to the Gopuram?

Kiran Teja Avvaru said...

Murali.. it was collapsed yesterday with major cracks. You can see the TV9 site about this..its very sadfull for us. We lost the prestigious construction.

భావన said...

అయ్యో.. ఒకప్పటి చారిత్రాత్మక కట్టడం కదా. ఆ విలువతోనైనా మన ఆర్కియాలజీ వాళ్ళు శ్రద్ధ వహించి వుండవలసింది. గుడి గోపురం కూలి పోయింది అంటే వినటానికే బాధ గా వుంది. :-(

Kiran Teja Avvaru said...

భావన గారు...!, ఆర్కియాలజీ వాళ్ళు శ్రధ్ధతీసుకోవడం కూడ జరిగింది..కూలిపోవడానికి 3 రోజుల ముందు...!, మన ప్రభుత్వాల గురించి తెలిసిందే కదా అండి..కామెంట్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ..!

Nrahamthulla said...

చారిత్రక ప్రసిధ్ధి గాంచిన గుడులు ఎక్కువగా నదీ తీరాల్లో ఉన్నాయి.వాటికి ఇసుక మాఫియా తీవ్ర నష్టం కలిగిస్తోంది.గనులు తవ్వే ఘనులు కొన్నిచోట్ల గుడుల్ని కూడా తవ్వేశారు.ఆలయాల ప్రక్కనే హెవీ ట్రాఫిక్,షాపింగ్ కాంప్లెక్స్ ల కోసం లోతైన త్రవ్వకాలు అన్నీ కారణాలే.
గుడి కూలును నుయి పూడును
వడి నీళ్ళన్ చెరువు తెగును, వనమును ఖిలమౌ
అని గువ్వల చెన్నడు ఆనాడే చెప్పాడు.ఏ మతం గుడి అయినా కూలినా కూల్చినా బాధే.మిగతావాటిని కూలకుండా కాపాడుకోవాలి.కూలినవాటిని తిరిగి కట్టాలి.

Kiran Teja Avvaru said...

@Nrahamthulla
చాలా బాగా చెప్పారు

A K Sastry said...

నిన్న నేను బ్లాగేక్షణలో వుండగా, మా అమ్మాయి అటేపు వెళుతూ, ‘అయ్యో!’ అంది.

యేమిటి అనడిగితే, “శ్రీకాళహస్తి గోపురం కూలిపోతోందట!!!" అంది.

టీవీ లో ఓ లుక్కేశాను…..గోపురం నెర్రెలిచ్చి, ఇసక రాలుతూండడం చూస్తూండగానే, దృశ్యం మారిపోయింది.

‘ఆహా! ఇంకా సమయం వుంది దాన్ని కాపాడడానికి……’ అనుకున్నాను.

పూర్తిగా కూలిపోయిందా????????????!!!!!!!!!!!!!!!!!!!

ఇప్పుడేం చేద్దాం???

Kiran Teja Avvaru said...

కృష్ణ శ్రీ గారు..!,ఇప్పుడు ఆ ప్రదేశం అంతా ఒక మట్టి దిబ్బలా తయారయ్యిందట,అదికారులు దీనికి నువ్వంతే నువ్వని ఇంకా వాదులాదుకొంటున్నరాని సమాచారం. శివుని ఆజ్ఞని శిరసా వహించే ఒక భక్తుడు, అధికారి రూపంలో, రామదాసు రామునికి గుడి కట్టించినట్టు ఇక్కడ గోపురం కట్టించడమే తరువాయి. కామెంట్స్ కి ధన్యవాదాలు ..!

Post a Comment