
ప్రతి వారాంతం హైదరాబాదులో విసుగ్గా వుంటుందని ఈ సారి మా అక్క వాల్ల ఊరికి వెళ్దామని నిర్ణయించుకున్నాను ..,
శనివారం ఉదయమే అక్క వాళ్ళ ఊరు... కడపలో బస్సు దిగాను ,
మా బావ బైక్ లో వచ్చి గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నాడు.
తను డాక్టర్ గా పని చేస్తున్నాడు కడప, RIMS హాస్పిటల్ లో...,
మా అక్క కూడ డాక్టర్ కాబట్టి ఇద్దరికి జోడు బాగుంటుందని మా అక్కకి ఈ సంబందం చేసాడు..మా నాన్న.
మా బావ వాళ్ళ ఇంటిలో అందరూ ఉమ్మడిగా కుటుంబంలా ఒకే ఇంట్లో వుంటారు,
అందరిని పలకరించి నేను రెడీ అయ్యేసరికి సమయం పది అయ్యింది.
ఈ రోజు అక్కతొ కలసి నేను కూడ వాళ్ళ హాస్పిటల్ కి వెళ్దామని అనుకున్నాను,
చెప్పడం మరిచాను మా అక్క కూడ కడపకి 6oKM దూరం లో వున్న బి.కోడూరు అనే మారు మూల గ్రామంలో ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తుంది..,రోజూ ఉదయంతో వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చేది.
ఆ రోజు కాస్త ఆలస్యంగా నేను,మా అక్క వాళ్ళ కారులో ఆ గ్రామానికి బయలుదేరాము..,
వెళ్ళిన కొంత సేపు చుట్టు పక్కలా అంతా పచ్చని పైరు,పొలాలు ఆ వాతావరణం చూడడానికి సంతోషంగా అనిపించింది....
ఇంకాస్తా ముందుకి వెళ్ళగానే కొండల మొదలు అంతా బీడు భూమి కనిపించదం మొదలయ్యింది,
ఇలాంటి ప్రదేశాల్లో కూడ ప్రజలు వుంటారా అని సందేహం నాలో కలిగింది..,అంతా ఎర్రమట్టి నేల..!,
కడప జిల్లా రంగు రాళ్ళకి బాగ ప్రసిధ్ధి,అలాగని ఆ ప్రాంతంలో నివసించడానికి కాదు కదా..!.
దారిలొ ఓ చోట మా అక్క డ్రైవర్ ని కారు ఆపమంటే సడెన్ గా ఆపాడు,
అలా కిందకు దిగాము, చుట్టూ అంతా ప్రొద్దుతిరుగుడు పూల పంటతో కనుచూపుమేర వరకు ఏదో పసుపూ తివాచి పరిచినట్లు చాలా అందంగా వుంది..,ఇంతలొనే ఇంత భేధమా అని అనుకున్నాను ..!,నా దగ్గర వున్న మొబైల్ ఫొన్తో కాసేపు ఫొటోస్ తీసుకొన్నాము.
మళ్ళి మొదలయ్యి తిన్నగా మా అక్క వాళ్ళ హాస్పిటల్ కి చేరాము,ఆ పల్లెలో అంతా వ్యవసాయం చేసే వాళ్ళే ఎక్కువ,
ప్రభుత్వాసుపత్రి, ప్రభుత్వ పాఠశాల సౌకర్యాలు బాగనే వున్నాయి..కాని వ్యవసాయం నమ్మినవాడు వ్యవసాయం, విద్యని నమ్మినవాడు విద్యలో కొనసాగుతున్నారు.సరిగ్గా లెక్క పెడితే మొత్తం 100 మంది వుంటారేమో ఆ పల్లెలో..!.
ఇంతలో నన్ను ఎవరా అని చూస్తున్న అందరికి "మా తమ్ముడు..!", అన్న మా అక్క సమాదానం అక్కడున్న వాళ్ళ మొహాళ్ళొ కాస్త ఆనందం నింపింది.
"ఏమి చేస్తావు బాబు..?" అని ఎవరో అడిగితే, "నేను హైదరబాదులో ఉద్యోగం చేస్తున్నాను..!" అని చెప్పా,
అలా కాసేపు వరండా బయట నుండి చుట్టుపక్కల ప్రదేశాలు గమనించాను..!,
ఇక్కడ సిటీలో లాగ, మనుషుల ఉరకలు పరుగులు లేవు,
మనిషికి మనిషికి సంబందం లేనట్టూ అక్కడలా ఇక్కద కనిపించలేదు..,
వీళ్ళ ఆలోచనావిధానానికి సిటీలో వారికి వ్యత్యాసం చాలానే వుంది,
అలా ఇలా మధ్యాహ్నం భోజన సమయం అయ్యింది.
రోజూ ఇంటిదగ్గరనుండి భోజనం తీసుకొచ్చే మా అక్క ఆ రోజు ఆ వూర్లోనే అదే హాస్పిటలో మందులు ఇచ్చే ఒక ఉద్యోగి ,పేరు నాకు గుర్తులేదు,కాని అతను చాల మంచి వాడు,పెళ్ళి అయ్యి రెండు సంవత్సరాలు అయ్యింది..,నన్ను, మా అక్కని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్ళాము...!,చాల బాగా రిసీవ్ చేసుకున్నారు..,అతనికి 9 నెలల బాబు,ఆ బాబు వచ్చీ రాని మాటలొతో చాలా ముద్దుగ వున్నాడు.
చెప్పడం మరిచిపోయాను రాగిసంఘటి ఇక్కడ చాలా బాగుంటుంది...,భోజనం అయ్యాక కాసేపు మంచి ఎండకి ఓ చెట్టు నీడన అలా కూర్చుని తాటిముంజలు తిన్నాము ఆ రోజుని నేను ఇప్పటికీ మరిచిపోలేను.మళ్ళీ హాస్పిటల్ కి వచ్చి కాసేపు వుండి..., కడపకి అంటే అక్కా వాళ్ళా ఇంటికి తిరుగుముకం పట్టాము కారులో..!.
అలా ఆ రోజంతా కడపకి దగ్గరి గ్రామంలో గడిపాను...!.
కాని ఇక్కడ ఒక్క విషయం చెప్పాలని అనుకొంటున్నాను,
మనం సినిమాల్లో చూసినట్టు కడప అంటే ఏదొ కత్తులు,కొడవళ్ళు చేతుల్లో పెట్టుకొని తిరుగుతున్నట్టు ఇక్కడ ఎవ్వరూ వుండరూ..,
ఇక్కడ అన్ని రకాల భూములు వున్నాయి అన్ని రకాల మనుషులు,అన్ని రకాల జీవన శైలులు కనిపిస్తాయి.
మనలో మన మాట.... " రెక్కాడితే కాని డొక్కాడని ఒక మనిషి కత్తులు,కటార్లతో ఏమి సాదిస్తాడు.. ..",మీరే ఊహించండి ..!
మన రాష్త్రంలో ఎక్కడికెళ్ళినా కష్టపడందే నాలుగు రాళ్ళు సంపాదించలేము, కడుపు నింపుకోలేము ..,అది నేనైనా కావచ్చు, మీరైన కావచ్చు ఇంకెవరైనా సరే, ఇది అందరికి తెలిసిని నగ్న సత్యం....ఒక మనిషి ప్రాంతం పేరు చెప్పి ఎన్ని రోజులు బ్రతక్కలడు ...!
నేటి యువతలో ప్రాంతాభిమానాన్ని రెచ్హగొడుతూ వారిని తమ స్వార్ద ప్రయోజనాలకి ఎలావాడాలో అలా వాడుకుంటూ వారి భవిష్యత్తున్ని నాశనం చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు..!
ఎక్కడొ ఒక వ్యక్తి ఊరు విడిచిపెట్టి పోయి, చాలా రోజుల తర్వాత, బాగా చదువుకొని తిరిగొచ్చి వాళ్ళ అమ్మ నాన్నలకి ఉద్యోగంతో తిరిగొస్తే, ఆ తల్లిదంద్రులకి ఎంత ఆనందంగా వుంటుంది.
అదే ఒక వ్యక్తి ఊరు విడిచిపెట్టి పోయి పట్టణంలో, రాష్త్రంలో ఒక ప్రాంతం కోసం ఇన్ని రోజులు మనల్ని స్కాలర్షిప్ లతో పొషించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలిలొ గొడవ కారణం చేత మరణించాడు అంటే, అదే తల్లిదంద్రులకి ఎంత బాధగా వుంటుంది.
కాబట్టి ......!
విద్యార్దులూ తస్మాత్ జాగ్రత్త...!మనం ఇంకా అనాగరికపు కాలంలో జీవించడం లేదు....మనకు కావలసిన సదుపాయాలు అన్ని వున్న ఈ దేశంలో కాస్త వివేకంగా సమయస్పూర్తితో వుండమన్నదే నా సందేశం..!
12 comments:
Nice presentation and gud message.
Its better to attach the photo.
Actually I am strong believer of being deprived of opportunities by migrants to Hyderabad. But what this man here has made me to rethink what my presumption(previous opinion) was. This made me to think, and I love this article for its message to the core.
Nice one !
రాయలసీమ అంటే ఎంతసేపూ కత్తులు, వేటకొడవళ్ళు, బాంబులు అని దుష్ప్రచారం చేసే సినీదర్శకులని అనాలి ముందు.కక్షలు, కార్పణ్యాలు ఎక్కడా ఉండేవే. కానీ వాటిని ఒక ప్రాంతానికి ఆపాదించి చూపడం అమానుషం.
వీటి నుంచి మన సినీపరిశ్రమ ఎప్పుడు బయట పడుతుందో ఏమో...
అందరికి ధన్యవాదాలు కామెంట్స్ ఇచ్చినందుకు...:-)
keka brother. nijamgaa gundey pindeysaav... Very very nice article.....
బాగా రాశారు
కమల్ జీ ..!,మీరు పండిత పుత్రులు అనుకుంటాను..నేను నాకు జరిగిన అనుభవాల్ని ఇక్కడ పొందుపరుస్తూ వున్నా.. నేను తెలుగులో లిటరేటర్ లు పూర్తి చేయలేదు (బ్లాగులో రాయడానికి..) ..మళ్ళి మీరు నాబ్లాగుకి వచ్చి పొరపాటు చేసినట్టు వున్నారు..ఈ ప్రపంచం లో అన్ని రకాల మనుషులు వుంటారు..సొ అందులో మీరు ఒకరుగా భావిస్తాను..కడప మీకే కాదు నాకు కూద బాగ తెలిసిన ప్రాంతం, నేను పుట్టింది కడప జిల్లా రాజంపేట (పేరు వినుంటారు..) దగ్గరి గ్రామం పుల్లంపేటలో , నందలూరు కి దగ్గరి టంగుటూరు ప్రాంతంలో నా విధ్యాబ్యాసం అయ్యింది...సో మీరు మీ బ్లాగు గురించి ఆలోచిస్తే బాగుంతుంది..మీకు ఈ ప్రపంచమ్ళొ శత్రువులు ఎక్కువలా వుంది, ప్లీజ్ వారికి దూరంగా వుండండి ...!
కడప మా ఊరు అని కాదు గానీ పల్లెలకు పోతే ఆ అనుభవమే వేరు.. మీకు మాంచి బ్రేక్ దొరికినట్టుంది..
కొంతమంది(నా కామెంట్స్ ని చూడచ్చు వారెవరో తెలుస్తుంది ..!)తమ తమ ఉనికిని ప్రపంచానికి చాటుకోవడానికి ఆ మాత్రం చేస్తుంటారు లేండి..నా బ్లాగులో నాకు బ్రేక్ వేసేవారెవరండి ...మీ కామెంట్ కి ధన్యవాదాలు ..!
Post a Comment