Wednesday, May 26, 2010

ప్రేమకి, పెళ్ళికి గల వ్యత్యాసం ఏంటి ..??


క్లాసులో అంతా శ్రద్దగా తెలుగు టీచర్ చెబుతున్న పాఠాన్ని వింటున్నారు.


ఇంతలో ఆ క్లాసులో కాస్త చురుకుగా వుండే పిల్లవాడు ఒకడు లేచి, "టీచర్ నాకో డౌట్..!",అన్నాడు.


పిల్లలకి వున్న సందేహాలని తీర్చడం టీచర్ గా ఆమె భాద్యత ,"అడుగు బాబు.." అంది ఆ టీచర్.


"ప్రేమకి, పెళ్ళికి గల వ్యత్యాసం ఎంటి?", అని అడిగాడు..,


టీచర్ నవ్వుకుంటూ ఆ బాబు ని దగ్గరకి పిలిచి,


"బాబు అక్కడ కనిపిస్తున్న బియ్యపు గోదాములోకి వెళ్ళి, అక్కడ ఎండకి ఆరపెట్టిన బియ్యంలో అతి పెద్దదైన బియ్యపు గింజని తీసుకొనిరా, కాని ఒక్క షరతు, తీసుకున్న గింజ మళ్ళి ముట్టుకోకూడదు...!", అని చెప్పింది.


చెప్పిందే తడవుగా ఆ పిల్లవాడు అక్కడికి వెళ్ళి అతి పెద్ద గింజ కొసం వెతకదం ప్రారంబించాడు. అత్యుత్సాహంతో అన్ని పెద్ద గింజలని వదిలేసి అందులో చివరికి చిన్న గింజని తీసుకొచ్చి టీచర్ కి ఇచ్చాడు, ఏదో పొగొట్టుకున్న వాడిలా.


టీచర్ మళ్ళీ తనతో, "ఇంకో అవకాశం ఇస్తున్నాను,ఈ సారి వెళ్ళి తీసుకొని రా ..!" అంది.


ఈ సారి ఆ పిల్లవాడు తెలివిగా,తనకి కనిపించిన కొద్దిపాటి గింజల్లో ఒక పెద్ద గింజని తీసుకొచ్చి తీచర్ కి ఇచ్చాడు,కాని ఇప్పుడు ముందు కంటే మేలుగా కాస్త పెద్ద గింజే తీసుకొచ్చాడు ,కాస్త నవ్వుతూ.


"ప్రేమకి,పెళ్ళికి గల తేడా కూడా నువ్వు చేసిన ఈ పనిలోనే వుంది,ఆ తేడాని నువ్వు నాకు రేపు క్లాసులో అందరి ముందు వినిపించు",
అని చెప్పి..క్లాసు ముగించింది టీచర్.


తర్వాత రోజు ఆ పిల్లవాడు ఏమి సమాధానం ఇస్తే ఆ టీచర్ సంతోషిస్తుందో... మీరే చెప్పండి ...?

4 comments:

శ్రీనివాస్ said...

ప్రేమించినా పెళ్లి చేసుకున్నా గింజలు ఏరుకోవడం కామన్

అశోక్ చౌదరి said...

ఏంటి శ్రీనివాస్? బాగా depression లో వున్నట్లున్నావ్ .. just kidding.. :-)

శ్రీనివాస్ said...

అశోక్ .... నన్ను డిప్రెషన్ లోకి పంపగల శాల్తీ ఇంకా పుట్టలేదు. :)) ఎవరికైనా మనవల్ల డిప్రెషన్ రావాలి గాని మనం తెచ్చుకోకూడదు.. అదన్నమాట

Sudheendra Bannai said...

I completely agree with Mr.Srinivas. If finances are not handled well then either arranged or love marriages will have their own hiccups.(I assume that finances is the unseen force behind any relations.)For this I have a great example take for example any relative and observe his feeling or behaviour when you tell him that you are going through hardship. I bet on him avoiding from the next moment itself. The only exception being parents and your life partner.

Post a Comment