Monday, May 24, 2010

పాశ్చాత్య సినిమాలు...వాటి తీరు ...!



"అది ఒక పాడుబడిన కోట, ఆ కోటకి కాపలా కాసే వాచ్ మెన్ అంత సేపు మేలుకొని మెల్లగా కునుకు తీశాడు...వున్నట్టుండి కోటలోపలి నుండి గట్టిగా శభ్దం ఎవరో అమ్మాయి గొంతు ...గట్టిగా అరిచినట్టు..ఇంతలో నిద్రలో వున్న అతను లేచి పక్కనే వున్న కోట తాళాల గుత్తి.లాంతరుతో కోట వైపు కోట తలుపులు తీసే ప్రయత్నం చేసాడు.

లోపల అంతా చీకటి ఎదురుగా కనిపిస్తున్న మెట్లను లాంతరు వెలుగులో ఎక్కే ప్రయత్నం చేసాడు...పక్కనే అటు ఇటు మెల్లిగా తిరుగుతున్న ఓ తలుపు వైపు తన పాదాలను మోపాడు ..!,మెల్లగా ఆ గదిలోకి ప్రవేశించాడు...,ఆ గది కోటలో ఒకప్ప్పుడు నివసించిన రాణి వారి అలంకార గది...,అదే గదిలో ఎదురుగా వున్న ఒక పెద్ద అద్దం వైపు చూస్తూ దాని దగ్గరకి వెళ్ళాడు.

ఇంతలో ఆ నిశబ్ద వాతావరణంలో ఆ అద్దం అంతా ఒక్క సారిగా చీలుతూ పగలడం మొదలయ్యింది..అంత వరకు ఎంతో దైర్యం గా వున్న ఆ వాచ్ మాన్ భయపద్దం మొదలు పెట్టాదు.. అంతే తన ముఖాన్ని అలానే పగిలిన అద్దంలోకి చూస్తుండగానే ...కింద పడిన ఒక పెద్ద అద్దం ముక్కతో అద్దంలో అటు వైపు వున్న తన ప్రతిబింబం తన గొంతును తనే కొసుకునే ప్రయత్నం చేస్తుంది ... ఇటు వైపు వాచ్ మాన్ కి గొంతు తెగి,రక్తం మడుగులో పడి విల విల లాడుతూ ప్రాణాలు వదిలాడు..!.
"



ఇంక చాలు వ్రాసే నాకే టైప్ చేయడానికి వ్రేళ్ళు వణుకుతున్నాయి...ఇదంత నిన్న ఆదివారం మా స్నేహితుల రూంలో చూసిన "మిర్రర్" అనే ఒక ఆంగ్ల చిత్రంలోని ఒక సన్నివేశం,... కొంపదీసి ఈ సన్నివేశం నేను గాని సృష్టించానని అనుకున్నరా ఎంటి..మనకు అంత సీన్ లేదు.


ఇప్పుడు ఈ సోదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నానంతే కారణం వుంది...,


ఒక గదిలో మద్యాహ్నం 3గంటల ప్రాంతంలో, గది తలుపులు గడిపెట్టి, కాస్త రూం అంతా చీకటి గా వున్న వాతావరణంలో మా స్నేహితులతో కలసి ఆ సినిమాని చూస్తున్న నాకే భయం ఆగడం లేదు..అలాంటిది చిన్న పిల్లలు ఇలాంటి సినిమాలని ఎలా చూస్తారా..? అని ఆలోచించా ..!.


పాశ్చాత్య దేశాలలో ఇలాంటి సినిమాలు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆస్వాదిస్తారట,అదేం సంస్కృతో అదేం మనుషులో...!.
మనషులు ఆలొచనా విధానం,వారి నడవడిక..వారిని పెంచిన తల్లిదండ్రుల మీద ఆదారపడి వుంటుంది..,


ఇలాంటి సిమిమాలను చూశాక పిల్లల్లో వుండే మరో కోణాన్నివాళ్ళకి తెలియకుండానే ఇవి వెలుగులోకి తీసుకొస్తాయి ..,తద్వార చిన్న వయసులోనే జైళ్ళు పాలయిన సంధర్బాలు ఆ దేశాళ్ళో కోకొల్లలు ,కాబట్టి వారికి ఏ వయసులో చేయాల్సిన అలవాట్లు ఆ వయసులో సమకూరేటట్లు తల్లిదండ్రులే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.


ఆ సినిమా చూసాక సరిగ్గా అద్దం ముందు ఒంటరిగా నిలబడాలన్న నాకు భయం వేస్తుంది ...,అసలే మా రూంలో ఈ రోజు నేను ఒక్కడినే వుంటున్నా.. ,మా రూంలో ఒక పెద్ద అద్దం కూడ వుంది, ఈ రోజు రాత్రి ఎలా వుండాలో ఏమో ...!,ప్లీజ్.. ప్లీజ్..ఎవరన్నా నాకు తోడుగా వుండరూ..! :-)

10 comments:

mitigatesoft said...

oh very creative!

శ్రీనివాస్ said...

సినిమా పరిచయం చేసినందుకు థాంక్స్ వర్డ్ వెరిఫికేషన్ తీసేయకూడదు

కమల్ said...

బాబు కిరణ్, పాశ్చాత్యదేశాలలో అలాంటి సినిమాలను కుటుంబ సమేతంగా వెళ్ళి ఆస్వాదిస్తారని...మీకు ఎవరు చెప్పారు..? అసలు పాశ్చాత్య సంస్కృతి ఏమిటో మీకు పూర్తిగా అవగాహన ఉందా..? లేక ఎవరో కొందరి ద్వార విన్న విషయమేనా..?
పాశ్చాత్య దేశాలలో సినిమాలకు మన దేశంలోలాగే అక్కడ కొన్ని గ్రేడింగ్స్ ఉన్నాయి 'A', 'R' , 'U'. ఇలా..! మనదేశంలో ఎవరూ ఇవి పాటించరు, కాని పాశ్చాత్యదేశాలలో చాలా కఠినంగా ఉంటాయి నిబందనలు, అక్కడ "A " సర్టిఫికేట్ ఉన్న సినిమాకి కేవలం 18 ఏళ్ళు దాటిన యువకులకి మాత్రమే థియేటర్సలోనికి అనుమతి ఇస్తారు. మరి మనదేశం గురించి, మన నిబందనలు ఎంత కఠినంగా ఉంటాయో, మనమెంత నిజాయితిగా ఉంటామో తమరికి తెలుసు అనుకుంటా..?
ఇక మీరు చూసిన సినిమా జెన్యూర్ "థ్రిల్లర్", అలాంటివి ఒక ప్రత్యేకమైన బావాలతో చిత్రీకరిస్తారు..అంతే గాని అవే ఆయా దేశాల సంస్కృతి అని అనుకుంటే ఎలా..? మనం కూడ అలాంటి చిత్రాలు తీస్తున్నాము కదా..? ఉదా : రామ్‌గోపాల్ వర్మ సినిమాలు..! పాశ్చాత్య సినిమాలంటే కేవలం మీరు చూసినవే కావు, మానవసంబాందాల మీద, మనుషుల ఉద్వేగాల మీద, అభిజాత్యం గురించి..చెప్పాలంటే చాలానే ఉన్నాయి సినిమాలు అవి చూడండి ..వాటిలో ఉన్న ఎమోషన్స్ గుర్తించండి..వాటి మీద తమరి విశ్లేషణ వ్రాయండి. మొదట తమరు వరల్డ్ క్లాసిక్ సినిమా " ది బైసికిల్ థీఫ్ " అన్న నలుపు - సినిమా చూడండి, తర్వాత " ద బెన్ - హర్ " సినిమా చూడండి..మెల్లిగా మీకె తెలుస్తాయి

Kiran Teja Avvaru said...

నాయనా కమల్..!, నేను నా ఈ చిన్న బ్లాగుకి ఇన్ని కష్టాలా....నేను ఈ పోస్ట్ లో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది చిన్న పిల్లల మనోబావాల పైన వాళ్ళ పెంపకం పైన .. నువ్వు ఇప్పటివరకు చూసిన సినిమాల పైన అయితే అస్సలు కాదు కావాలంటే అది మరో బ్లాగులో బ్లాగుకొందాము సెపరేటుగా మరియు ..నీకు ప్రత్యేకంగా..!

కమల్ said...

అయ్యా కిరన్ తేజ్ గారు, నా వ్యాక్యానం మీ బ్లాగ్ కి కష్టాలు తెచ్చిపెట్టిందా..? నేను కేవలం మీకు విషయాలు చెప్పడానికే వ్యాక్యానించా..మీరందులో ' విమర్శ ' మాత్రమే చూస్తున్నట్లున్నారు...! సరే మీ పోస్ట్‌లో కేవలం పిల్లలమీద ప్రత్యేకదృష్టి మాత్రమే పెట్టినట్లు చెప్పారు, కాని వ్యాసంలో అలా లేదుగా ఒక ఆంగ్ల సినిమా తీసుకొని దానిని పిల్లలు చూస్తే ఎలా అవుతారు అన్నది మాత్రమే వ్రాసారు..దానికి మాత్రమే నేను వ్యాక్యానించా! సొ మీ కాంటెంట్‌లో స్పష్టత లేకపోవడం వలన వచ్చిన తిప్పలు ఇవి..! పిల్లల మనస్థత్వాలమీద, వారి మనోభావాల మీద వ్యాసం లా అనిపించలేదు మరి. నా కామెంట్‌లో ఎటువంటి లోపం లేదనిపిస్తుంది. అలాగే మీరుదహరించిన వ్యాక్యం చూడండి...!

"పాశ్చాత్య దేశాలలో ఇలాంటి సినిమాలు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆస్వాదిస్తారట,అదేం సంస్కృతో అదేం మనుషులో...!.
మనషులు ఆలొచనా విధానం,వారి నడవడిక..వారిని పెంచిన తల్లిదండ్రుల మీద ఆదారపడి వుంటుంది..,

ఇలాంటి సిమిమాలను చూశాక పిల్లల్లో వుండే మరో కోణాన్నివాళ్ళకి తెలియకుండానే ఇవి వెలుగులోకి తీసుకొస్తాయి ..,తద్వార చిన్న వయసులోనే జైళ్ళు పాలయిన సంధర్బాలు ఆ దేశాళ్ళో కోకొల్లలు ,కాబట్టి వారికి ఏ వయసులో చేయాల్సిన అలవాట్లు ఆ వయసులో సమకూరేటట్లు తల్లిదండ్రులే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. "


మీరు చెప్పిన సినిమాలు ఏ దేశంలో చూస్తున్నారు..? మనదేశమా..? లేక పాశ్చాత్యదేశాలా..? సొ.. పైన మీ ఆర్టికల్ లోని ఒక భాగాన్ని చూసాక.. నా కామెంట్ సరైనదే అని అనుకుంటున్నా..! నేనేమి మీ పైకి దండయాత్ర చేయట్లేదు..కేవలం విషయం చెప్పాలని చెప్పా అంతే...! మీరు ఆర్టికల్స్ వ్రాసాక..కామెంట్స్ వస్తాయి అందులో సహేతుకత ఉన్నదా లేక ఊరికే అల్లాటప్పాగా విమర్శ ఉన్నదా అన్నది పరిశీలించండి..! అంతే గాని అపార్థం చేసుకోకండి..!

శరత్ కాలమ్ said...

@ కమల్
మీరు చెప్పింది బావుంది.

Kiran Teja Avvaru said...

@శరత్ 'కాలమ్' ,
నారాయణ..! నారాయణ ..!

Kiran Teja Avvaru said...

@ కమల్
"అసలు పాశ్చాత్య సంస్కృతి ఏమిటో మీకు పూర్తిగా అవగాహన ఉందా..? లేక ఎవరో కొందరి ద్వార విన్న విషయమేనా..?",

దీన్ని అచ్చ తెలుగులో ఎమంటారో మా ఊర్లో అయితే "విమర్శ" అని అంటారు, మా ఊరే కాదు అన్ని వూర్లలో దాదాపు, మరి మీది ఏ ఊరో తెలియదు ..!

శ్రీనివాస్ said...

ఏ సినిమా నిన్న చూశాను దయ్యలకి అన్నీ రివర్స్ లో అంటే మనం అద్దం లో చూసినట్టు కనిపిస్తాయనమాట .... మనలో మాట రాత్రి కొన్ని దయ్యాలు కలలోకి కూడా వచాయి . మరిన్ని సినిమాలు పరిచయం చేయండి. మాలాంటి శాడిస్ట్ ప్రేక్షకులకి బాగా నచ్చుతాయి.

Kiran Teja Avvaru said...

@శ్రీనివాస్
నాకు ఈ హర్రర్ సినిమాలు అంటే అస్సలు పడదండి ..నేను చెప్పలేను..

Post a Comment